రష్యాలో ఘోర విమాన ప్రమాదం
` 43 మంది దుర్మరణం
` గమ్యానికి అతిదగ్గరలో కూప్పలికూలిన లోహవిహంగం
మాస్కో(జనంసాక్షి):రష్యాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న అంగారా ఎయిర్‌లైన్స్ విమానం చైనా సరిహద్దులో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 43 మంది మృతి చెందినట్లు సమాచారం.ప్రతికూల వాతావరణమే ప్రమాదానికి కారణంగా అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. స్థానిక కాలమానం ప్రకారం.. సుమారు 43 మందితో(ప్రయాణికులు(ఐదుగురు చిన్నారులు సహా), సిబ్బంది) టిండా ఎయిర్‌పోర్టుకు అది చేరుకోవాల్సి ఉంది. అయితే గమ్యస్థానానికి కొద్దికిలోమీటర్ల దూరంలో ఉండగానే ఈస్ట్రన్ అమూర్ రీజియన్‌లో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో(ఏటీసీ) సంబంధాలు తెగిపోయింది. దీంతో విమానం అదృశ్యమైనట్లు ప్రకటించిన అధికారులు.. దాని ఆచూకీ కోసం ప్రయత్నించారు.అయితే.. కాసేపటికే అమూర్ రీజియన్‌లోని దట్టమైన అడవుల్లో విమాన శకలాలను గుర్తించారు. మృతులు, క్షతగాత్రుల సంఖ్యపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే ప్రమాద తీవ్రత దృష్ట్యా ఎవరూ ప్రాణాలతో బయటపడే అవకాశం లేదని అధికారులు స్పష్టం చేశారు. అంగారా ఎయిర్‌లైన్స్ (%Aఅస్త్రaతీa Aఱతీశ్రీఱఅవం%) రష్యాలోని ఇర్కుట్స్క్ కేంద్రంగా పనిచేసే ప్రాంతీయ విమాన సంస్థ. ఇది 2000లో స్థాపించబడిరది. అంగారా నది పేరు మీద ఎయిర్‌లైన్స్‌కు ఈ పేరు పెట్టారు. సైబీరియాతో పాటు రష్యాలోని ఇతర ప్రాంతాలకు ఈ విమానయాన సంస్థ నిత్యం రవాణా సేవలు అందిస్తోంది. అలాగే చైనాలోని మాంరaౌలి రీజియనకు కూడా సర్వీసులను నడుపుతోంది.