కన్నుల పండుగగా మారుతి నగర్ యూత్ ఆధ్వర్యంలో గణనాధుని శోభయాత్ర
భక్తిశ్రద్ధలతో నిమజ్జన వేడుకలు మార్మోగిన గణనాధుని నామస్మరణం
గరిడేపల్లి, సెప్టెంబర్ 11( జనం సాక్షి ):తొమ్మిది రోజులపాటు భక్తుల నుంచి విశేష పూజలు అందుకున్న గణనాధుడిని ఆదివారం వైభవంగా నిమజ్జనానికి తరలించారు. గరిడేపల్లి మండలంలోని మారుతీ నగర్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయక మండపంలో కొలువుదీరిన గణపయ్యకు నవరాత్రులు ఉత్సవాలో మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జై బోలో గణేష్ మహరాజ్ కి జై అంటూ భక్తిశ్రద్ధలతో నిమజ్జన కార్యక్రమం కన్నుల పండుగగా సాగింది.తొమ్మిది రోజులుగా పూజలు అందుకున్న గణనాథుడు గంగమ్మ ఒడికి పయనమయ్యాడు.బ్యాండ్ మేళాలు భక్తి గేయాలు మహిళల కోలాటాలు పిల్లల కేరింతల నడుమ యువత చిందులేస్తూ ముందుకు సాగారు. డీజే చప్పుళ్ల మధ్య స్టెప్స్ వేస్తూ మహిళలతో పాటు యూత్ యువకులు గణనాథుని సన్నిధిలో చూపర్లను ఆకట్టుకున్నాయి. మారుతి నగర్ లో ఉన్న వినాయకుడి దగ్గర ఏర్పాటు చేసిన మహా లడ్డు ప్రసాదాన్ని మేకపోతుల శ్రీనివాస్ దుర్గ 8,116 రూపాయలు వినాయకుని పట్టు వస్త్రాలను మండాది వెంకయ్య సైదమ్మ 2,116 రూపాయలకు గెలుచుకున్నారు. ఈ కార్యక్రమంలో మారుతీ నగర్ యూత్ కమిటీ, గ్రామ పెద్దలు పిల్లలు తదితరులు పాల్గొన్నారు.