కరాటే క్రీడల్లో చేర్యాల క్రీడాకారులు ముందంజ

కరాటే క్రీడాకారులకు బంగారు,వెండి పథకాలు
చేర్యాల (జనంసాక్షి) నవంబర్ 28 : చేర్యాల ప్రాంతానికి చెందిన కరాటే క్రీడాకారులు బంగారు, వెండి పథకాలు సాధించి క్రీడల్లో ముందంజలో నిలిచారు. ఈనెల 27న ఆదివారం హైదరాబాద్ యూసుఫ్ గూడా లోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో ప్రముఖ సినీ నటులు కరాటే లెజెండ్ ఇండియా కరాటే చైర్మన్ డాక్టర్ సుమన్ తల్వార్ తల్లి జ్ఞాపకార్థం “కేసరి చంద్ర మెమోరియల్ నేషనల్ కరాటే ఓపెన్ ఛాంపియన్షిప్” జరిగాయి. ఈ క్రీడలలో దాదాపు 6వేల మంది కరాటే క్రీడాకారులు పాల్గొనగా జపాన్ కరాటే షోటో ఫెడరేషన్ చేర్యాల, వేచరేణి, కిష్టంపేట పలు గ్రామాలకు చెందిన పలువురు విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచి బంగారు పతకాలతో పాటు వెండి పతకాలు సాధించారని తెలంగాణ రాష్ట్ర కరాటే అధ్యక్షులు సెన్సాయి, బ్లాక్ బెల్టు ఆరవ డాన్ ఎం.ఎస్. పాషా తెలిపారు. చేర్యాలకు చెందిన సిహెచ్. అభినవ్, సిహెచ్. రాజకుమార్, అమర్, విశ్వ ప్రకాష్ లకు గోల్డ్ మెడల్స్ మరియు శ్యాంసుందర్, అవినాష్లకు సిల్వర్ మెడల్స్ దక్కినాయి. వేచరేణి ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థులు ఎండీ. గౌస్ పాషా, యం.అరుణ్ కుమార్, శ్యాంసన్, శ్రావణ్, కే.రాజు, ఇ.మౌనిక, ఇ.అంజలి, అమరగొండ ఇందు గోల్డ్ మెడల్స్ సాధించారు. కే.సాయికుమార్, ఇ. అజయ్, ఇ. సాయిచరణ్ లకు సిల్వర్ మెడల్స్ వచ్చాయి.  కిష్టంపేట గ్రామానికి చెందిన వేచరేణి ప్రభుత్వ పాఠశాలకు చెందిన పలు విద్యార్థులు బీ.హానిక, లింగంపల్లి నమ్రత, తలారి మానస, తలారి సుస్మిత, తలారి నవ్య శ్రీ ,ఎలికట్టే మేఘన గోల్డ్ మెడల్ సాధించగా తాళ్లపల్లి కీర్తి, కొయ్యడ రేవతి లకు సిల్వర్ మెడల్స్ కైవసం చేసుకున్నారని సెన్సాయి ఎమ్మెస్ పాషా తెలిపారు. విజేతలకు టోర్నీ ఆర్గనైజర్ సినీ నటులు సుమన్ అల్వార్, చిన్న శ్రీశైలం యాదవ్ పోలీసు ఉన్నత అధికారులు, సత్య శంకరులు మెడల్స్ ధ్రువపత్రాలను అందజేశారు. విజేతలను చేర్యాల మున్సిపాలిటీ చైర్మన్ శ్రీధర్, కౌన్సిలర్లు, వేచరేణి, కిష్టంపేట ఇరు గ్రామాల సర్పంచులు ఏనుగుల దుర్గయ్య, కరుణాకర్లు, ఎంపీటీసీ లక్ష్మీ నర్సయ్య, పాఠశాల ఉపాధ్యాయ బృందం, గ్రామస్తులు, విద్యార్థులను అభినందించారు.