కరుణ్ నాయర్కు తప్పిన ప్రమాదం
అలప్పుజ(కేరళ): భారత క్రికెటర్, కర్ణాటక ఆటగాడు కరుణ్ నాయర్కు తృటిలో పడవ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఆదివారం పంపా నదిలో స్నేక్ బోట్లో ప్రయాణిస్తున్న సమయంలో ఆ పడవ తిరగబడింది. ఆ పడవలో ప్రయాణిస్తున్న కరుణ్ నాయర్తో పాటు పలువురు సురక్షితంగా ప్రాణాలతో బయటపడగా, ఇద్దరు ఆచూకీ గల్లంతైంది.
సుమారు 100 మందితో ప్రయాణించడంతోనే ఆ పడవ తల్లక్రిందులైనట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు. వీరంతా శ్రీ పార్థసారథి స్వామి ఆలయంలో జరిగే వాల్లా సద్యా ఉత్సవానికి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం చేసుకున్నట్లు తెలిపారు. అయితే పడవ ప్రమాదం సంభవించిన వెంటనే అక్కడ ఉన్న రెస్క్యూ సిబ్బంది అప్రమత్తం కావడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లు ఆర్నామూలా పోలీస్ స్టేషన్ అధికారులు స్పష్టం చేశారు. ఆ ఇద్దరి ఆచూకీ గాలింపు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఇటీవల జింబాబ్వే పర్యటనకు వెళ్లిన భారత జట్టులో కరుణ్ నాయర్ కు స్థానం కల్పించగా, వెస్టిండీస్ టూర్ నుంచి ఆ క్రికెటర్కు విశ్రాంతినిచ్చారు.