కరెంట్ కోతకు నిరసనగా ధర్నా…
రామగుండం, జులై 16, (జనం సాక్షి)
రాష్ట్రవ్యాప్తంగా అమలుచేస్తున్న కరెంట్ కోతకు నిరసనగా తెలంగాణ రాష్ట్ర సమితి(టిఆర్‌ఎస్) ఇచ్చిన పిలుపుమేరకు సోమవారం రామగుండం ఏఈ కార్యాలయం ముందు మండల టిఆర్‌ఎస్ నాయకులు ధర్నా నిర్వహించి, అధికారికి వినతిపత్రం అందచేశారు. విద్యుత్ కోత వలన గ్రామాల్లో నీటి సౌకర్యం నిలిచిపోతుందని, పంటపొలాలకు నీటిఎద్దడి కలుగుతుందని దీంతో రైతులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని… వెంటనే విద్యుత్‌కోతను నిలిపివేసి, సక్రమంగా విద్యుత్ సరఫరా చేయాలని వారు ఆ వినతిపత్రంలో పేర్కొన్నారు. వినతిపత్రం అందించిన వారిలో మాజీ ఎంపిపి కందుల సంధ్యారాణి, మాజీ ఎంపిటిసి చల్ల రవీందర్‌రెడ్డి, టిఆర్‌ఎస్ నాయకులు నారాయణరెడ్డి, కందుల పోచం, బొడ్డుపల్లి శ్రీనివాస్, బండారి ప్రవీణ్, లవన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.