కలంకితులను సాగనంపండి గవర్నర్‌ను కలిసిన చంద్రబాబు

హైదరాబాద్‌, మే13 (జనంసాక్షి) :
కళంకిత మంత్రులను సాగనంపాలని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు డిమాండ్‌ చేశారు. సోమవారం ఆయన రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ను కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కళంకితులను తొలగించే వరకు పోరాటం చేస్తామని అన్నారు. ఛార్జ్‌షీట్లు ఎదుర్కొంటున్న మంత్రులను తొలగించాలని గవర్నర్‌ను కోరామన్నారు. జలయజ్ఞం, సెజ్‌లు, ఖనిజ సంపద కేటాయింపుల్లో భారీగా అవినీతి జరిగిందన్నారు. అవినీతి జరిగిన విషయం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు తెలిసినా చర్యలు తీసుకోలేదని చంద్రబాబు ఆరోపించా రు. ధర్మాన రాజీనామా చేసినా ముఖ్యమంత్రి ఆమోదించలేదన్నారు. ¬ం మంత్రిపై ఆరోపణలు వచ్చినా, అధికారంలో కొనసాగుతున్నారన్నారు. ఆరుగు రు మంత్రులకు న్యాయ సహాయం అందించడం రాజ్యాంగ ఉల్లంఘన అని, అవినీతి మంత్రులను ప్రోత్సహించేలా ముఖ్య మంత్రి వ్యవహరిస్తున్నారని చంద్ర బాబు అన్నారు. సీబీఐ ఛార్జిషీటు వేసిన తర్వాత మంత్రులకు అధికారం లో కొనసాగే అర్హత లేదన్నారు. తాము చెప్పిన విషయాలను విన్న గవర్నర్‌ ఏవిూ మాట్లాడకుండా వెళ్లిపోయారని చంద్రబాబు పేర్కొ న్నారు. అయితే మంత్రులను తొల గించే వరకు తమ పోరాటం ఆగదన్నారు.  మంత్రులపై చర్యలు తీసుకోవాలని కోరితే గవర్నర్‌ మౌనంగా విని ఊరుకున్నారని చంద్రబాబు మీడియా ప్రతినిధులతో చెప్పారు.  కళంకిత మంత్రుల పట్ల గవర్నర్‌ నరసింహన్‌ ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని ఆయన విమర్శించారు. జగన్‌ ఆస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న మంత్రులు కొనసాగడానికి అనర్హులని ఆయన అన్నారు. ఈ విషయాన్ని తాము ఇంతటితో వదలబోమని, మంత్రులను తప్పించేంత వరకు ఉద్యమం చేస్తామని ఆయన చెప్పారు. కళంకిత మంత్రులను తొలగించేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను కోరినట్లు ఆయన తెలిపారు. జగన్‌ ఆస్తుల కేసులో సిబిఐ దాఖలు చేసిన చార్జిషీట్లలో పేర్లున్న మంత్రులు కొనసాగడానికి వీలు లేదని ఆయన అన్నారు. తీవ్రవాద సమస్య కన్నా అవినీతి ప్రమాదకరమైందని ఆయన వ్యాఖ్యానించారు. కళంకిత మంత్రులను తొలగించాలని గవర్నర్‌ ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డిని ఆదేశించాలని, ముఖ్యమంత్రి తొలగించకపోతే గవర్నర్‌ వారిని డిస్మిస్‌ చేయాలని చంద్రబాబు అన్నారు. టిడిపి బృందంలో ఎంపీలు నామా నాగేశ్వర రావు, శివప్రసాద్‌, గాలి ముద్దకృష్ణమనాయడుడు, బొజ్జల గోపాల కృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు.