*కలకోవ గ్రామంలో సిపిఎం పార్టీ కార్యకర్తలపై టిఆర్ఎస్ కార్యకర్తలు రాళ్లతో దాడి అవాస్తవం*

– టిఆర్ఎస్ పార్టీ నాయకులు కొంపెల్లి వీరబాబు

మునగాల, అక్టోబర్ 8(జనంసాక్షి): కలకోవ గ్రామంలో సిపిఎం పార్టీ కార్యకర్తలపై టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు రాళ్లతో దాడి చేసిన మాట అవాస్తవం అని టిఆర్ఎస్ పార్టీ నాయకులు కొంపెల్లి వీరబాబు తీవ్రంగా ఖండించారు. సిపిఎం పార్టీ కార్యకర్తలపై దాడి జరిగిందని తప్పుడు మాటలు మాట్లాడినటువంటి కలకోవ గ్రామ రౌడీ షీటర్ 78కేసులు ఉన్ననటువంటి ఓ నాయకునిపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కలకోవ గ్రామ అభివృద్ధి కమిటీ మెంబర్ కొంపెల్లి వీరబాబు అన్నారు. ఈ సందర్భంగా శనివారం నాడు టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో కొంపల్లి వీరబాబు మాట్లాడుతూ, కలకోవ గ్రామంలో సిపిఎం పార్టీ నాయకులు కార్యకర్తలు గత 30 సంవత్సరాలుగా వారి ఆగడాలు అరాచకాలు అన్యాయాలు చూసి వారిని ప్రజాస్వామ్యంలో పక్కన పెట్టినారని, అధికారం కావాలనే వ్యామోహంతో పదవుల ఆంక్షతో కోదాడ శాసనసభ్యులు ముత్యంలాంటి మల్లన్నపై అనుచితమైన వ్యాఖ్యలు చేసి, పెద్దవారు కావాలి అనుకుంటే దొడ్డిదారిన పయనించే మీకు తగిన శాస్తి తప్పదన్నారు. దాదాపు 40 సార్లు టిఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారని, ఇక్కడే నీ నీచ బుద్ధి కనిపిస్తుందని ఎద్దేవా చేశారు. గతంలో గ్రామంలో బహిరంగ సవాల్ కు సిద్ధమన్నాడని, తాము సవాల్ విసిరితే మీరు రాలేదని అన్నారు. గతంలో 30 సంవత్సరాల మీ పాలనలో కొక్కు ధర్మరాజు నిమ్మ తోట నరికించింది నీవు కాదా..అని, తిప్పని వీరయ్య ఇంటిమీద పడి పశువుల్ని నరికించింది నీవు కాదా..అని, సుంకర కోటయ్య ఇంటిపై దాడి చేసింది మీరు కాదా..అని, గ్రామంలో రైతు అమరగాని మల్లయ్య వ్యవసాయ బోర్లలో రాళ్లు కొట్టించినది నీవని, మండవ చిన్న సైదులును హత్య చేయడానికి ప్రయత్నించి ఇంటిపై దాడి చేసి 22 మంది జైలుకు పోయింది మీరు కాదా..అని, నీ నాయకత్వంలో మీ పార్టీ నుంచి నువ్వు పెట్టిన ఇబ్బందులు తట్టుకోలేక నలుగురు గ్రామవాసులు ఆత్మహత్య చేసుకోలేదా..అని, టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గ్రామ అభివృద్ధిని చూసి నీవు ఓర్వలేక నీ చిల్లర రాజకీయాలు మళ్లీ మొదలు పెట్టావా..అని, మళ్లీ గ్రామాన్ని ఫ్యాక్షన్ విలేజ్ గా మారుద్దాం అనుకుంటున్నావా అని, కోదాడ నియోజకవర్గ శాసనసభ్యులు నీలాంటి రౌడీ షిటర్ల గురించి ఇప్పటికైనా పట్టించుకోని పి.డి ఓపెన్ చేసి గ్రామాలను ప్రశాంత వాతావరణంలో ఉంచాలని కోరారు. కలకోవ గ్రామంలో సాయంత్రం సమయంలో అమాయక ప్రజలకు మద్యం సేవించి సమస్యలు సృష్టిస్తున్నటువంటి మండవ వెంకటాద్రిపై పోలీసులు ఎంక్వయిరీ చేసి చర్యలు తీసుకోవాలని, గ్రామాన్ని ప్రశాంత వాతావరణంలో ఉంచాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మునగాల పిఎసిఎస్ చైర్మన్ కందిమండ సత్యనారాయణ, టిఆర్ఎస్ పార్టీ నాయకులు గండు అంజయ్య, సాకని నాగేంద్రబాబు, కలకోవ గ్రామ పెద్దలు గన్నా నరసింహారావు, మండవ చిన్న సైదులు, పనస వీరయ్య, కుక్కడం సైదులు పాల్గొన్నారు.