కలెక్టర్ కు వినతి పత్రం
కరీంనగర్ : మున్సిపల్ కార్పోరేషన్ కోర్టు రిజర్వాయర్‌లో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగి ఆకుల సత్తయ్య నగర వాసులపై ఆధారాలు లేకుండా అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నాడని కావున అతనిపై తగిన చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ నగరశాఖ జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు.కరీంనగర్ మున్సిపల్ కార్పోరేషన్ కోర్టు రిజర్వాయర్‌లో అకుల సత్తయ్య కాంట్రాక్టు ఉద్యోగిగా సుమారు 15 సంవత్సరాల నుండి పని చేస్తున్నాడని ఇతను అనేక విధాలుగా కరీంనగర్ నగరంలో వివిధ వర్గాల ప్రజల నుండి అక్రమ నల్లా కనెక్షన్లు ఉన్నాయంటూ మరియు కరెంట్ మోటార్లు బిగిస్తున్నారంటూ కమర్షియల్, ప్రైవేట్ సంస్థలు, హాస్సిటల్స్, హాస్టల్స్, హోటల్స్ మరియు ఇళ్ల యజమానులపై ఎలాంటి ఆధారాలు, సాక్ష్యాలు లేకుండా అక్రమంగా డబ్బులు వసూలు చేస్తూ, ఎలాంటి జరిమాన రశీదులు ఇవ్వకుండా, లంచం ఇస్తే వెంటనే మళ్లీ నల్లా కనెక్షన్లు బిగిస్తు, తీసుకెళ్లిన మోటర్లు వాపస్ చేస్తూ అనేక అక్రమాలకు పాల్పడుతున్నాడని ఎవరైన లంచం ఇవ్వకుంటే కరెంట్ మోటర్లు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నాడని, ఇదేంటని ప్రశ్నిస్తే మున్సిపల్‌లో ఏ అధికారికి అయిన చెప్పుకో నన్ను ఎవరు ఏమి చేయలేరని, నీకు దిక్కున్న చోట నా మీద ఫిర్యాదు చేసిన నన్ను ఎవరు ఏమి చేయలేరని బెదిరిస్తున్నాడని కావునా ఇప్పటివరకు ఎన్ని నల్లా కనెక్షన్లు తొలగించినారో మరియు ఎన్ని కరెంటు మోటార్లు తీసుకెళ్లారో మున్సిపల్ కర్పోరేషన్ అధికారులు నగర ప్రజలకు బహిరంగంగా పత్రికల ద్వారా వివరణ తెలుపాలని మరియు కాంట్రాక్టు ఉద్యోగి ఆకుల సత్తయ్యపై చర్య తీసుకోని విధుల నుండి తొలగించాలని భారతీయ జనతా పార్టీ నగర కార్యదర్శి ముప్పిడి సునీల్ కుమార్ మరియు భారతీయ జనతా పార్టీ నగర శాఖ సభ్యులు కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు