కళాకారులకు చేయుత అందించిన రసమయి బాలకిషన్ పిఆర్సి పెంపుపై చైర్మన్ రసమయికి కృతజ్ఞతలు తెలిపిన కళాకారులు.
రాజన్నసిరిసిల్లబ్యూరో ఆగస్టు 30. (జనంసాక్షి). సాంస్కృతిక సారథి కళాకారుల పరిస్థితిలను అర్థం చేసుకొని ముప్పై శాతం పి. ఆర్ సి పెంచడంపై కళాకారులు హర్షం వ్యక్తం చేశారు. బుధవారం కళాకారులు వెల్మల శ్రీధర్ రెడ్డి, ఆకునూరు దేవయ్య, శ్రీరాముల రామచంద్రములు మానకొండూరు శాసనసభ్యులు సాంస్కృతిక సారి చైర్మన్ రసమయి బాలకిషన్ కలిసి పూల బొకే ఇచ్చి కృతజ్ఞతలు తెలిపారు . ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలోని అనేకమంది కళాకారులకు రాష్ట్ర ప్రభుత్వం చేయూతగా నిలబడడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఉద్యోగాలు ఇచ్చి జీవితాలను నిలబెట్టిందని అన్నారు. ఇప్పుడు కళాకారుల ఆర్థిక పరిస్థితులు దృష్టిలో ఉంచుకొని 30 శాతం పిఆర్సి ని పెంచడం ఆనందంగా ఉందని అన్నారు. ఆర్థికంగా కళాకారులకు వెసులుబాటు కల్పించి ప్రభుత్వ నిర్ణయం కళాకారులకు ఎంతో సంతోషాన్ని అందించిందని అన్నారు. కళాకారుల పిఆర్సి పెరగడానికి దోహదం చేసిన సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ కు రుణపడి ఉంటామని తెలిపారు.