కళాకారులు ఆటపాటలతో ఆర్థిక లావాదేవీలపై రైతులకు అవగాహన.

నెరడిగొండజనంసాక్షి న్యూస్:
ఎడిసిసి బ్యాంకు ద్వారా రైతులకు ఇస్తున్న వ్యవసాయ రుణాలను సకాలంలో చెల్లించి వడ్డీ రాయితీలు పొందాలని నేరడిగొండ సొసైటీ సీఈవో నాగభూషణ్ అన్నారు. బుధవారం రోజున ప్రాథమిక సహకార సంఘం ఆవరణలో నాబార్డు వారి ఆర్థిక సౌజన్యంతో కళాజాత బృందం ద్వారా ఆర్థిక అక్షరాస్యత అవగాహన సదస్సు నిర్వహించారు.రైతులకు వ్యవసాయ వాహనాలకు రుణాలు బంగారంపై తక్షణమే రుణాలు పొదుపు ఇన్సూరెన్స్ పథకాలు సైబర్ నేరాల గురించి కళాకారులు ఆట పాటలతో అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో సొసైటీ సిఈఓ నాగ భూషణ్ సొసైటీ సిబ్బంది కళాజాత బృందం సభ్యులు రమేష్ నారాయణ రైతులు పాల్గొన్నారు.
Attachments area