కళాశాల విద్యార్థినిలకు అనీమియా థైరాయిడ్ పరీక్షలు
పానుగల్ సెప్టెంబర్19( జనంసాక్షి )
మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల యందు సోమవారం విద్యార్థినీలకు అనీమియా థైరాయిడ్ మరియు ఇతర పరీక్షల కొరకు టీ హబ్ కార్యక్రమం ద్వారా రక్త నమోనాలు సేకరించడం జరిగిందని వైద్యాధికారి డాక్టర్ రాజశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా వైద్యాధికారి మాట్లాడుతూ అనిమీయ థైరాయిడ్ రక్త పరీక్షల నమూనాలను కళాశాలలోని 37 మంది విద్యార్థిని ల నుంచి సేకరించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు సంతోషమ్మ, శ్రీనివాసులు, నరసమ్మ ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలు, ల్యాబ్ సిబ్బంది , కళాశాల ప్రిన్సిపల్ ప్రకాశం మరియు అధ్యాపక సిబ్బంది పాల్గొనడం జరిగింది.