కష్టజీవుల పార్టీ కమ్యూనిస్టు పార్టీ జాతీయ మహాసభలను విజయవంతం చేయండి: సిపిఐ మండల కార్యదర్శి పోకల వెంకటేశ్వర్లు
గరిడేపల్లి, అక్టోబర్ 10 (జనం సాక్షి): అక్టోబర్ 14-18 తేదీ వరకు విజయవాడలో జరిగే సిపిఐ జాతీయ మహాసభలు విజయవంతానికి సిపిఐ కార్యకర్తలు అందరు కృషి చేయాలని సిపిఐ మండల కార్యదర్శి వెంకటేశ్వర్లు కోరారు. సోమవారం మండలంలోని రంగాపురం గ్రామంలో జరిగిన సిపిఐ గ్రామ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఓట్ల కోసం సీట్ల కోసం కాకుండా కష్టజీవుల సమస్యలపై వారి హక్కుల పరిరక్షణ కొరకు పాలకవర్గ పార్టీలు అవలంభించే నియంత విధానాలపై ఏ స్వార్ధం లేకుండా పనిచేసేది ఒక్క కమ్యూనిస్టు పార్టీ మాత్రమేనని ఆయన అన్నారు. భారతదేశ చరిత్రలో సిపిఐ కి ప్రత్యేక స్థానం ఉన్నదని దేశ స్వాతంత్ర్యము కోసం సిపిఐ ముందుండి పోరాడిందని స్వాతంత్ర్యము కావాలని బ్రిటిష్ వాళ్ళను మొదటిగా డిమాండ్ చేసిన పార్టీ సిపిఐ అని స్వాతంత్ర్యనంతరం పాలకులు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక నిర్ణయాలపై అలుపెరుగని పోరాటం ప్రజల పక్షన చేస్తున్న పార్టీ సిపిఐ మాత్రమేనని ఆయన అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటం లో వేలాది మంది వీరులను త్యాగం చేసి లక్షలాది ఎకరాల భూములను పేదలకు పంచటమే కాక వేలాది గ్రామాలను దేశముఖ్ ల దొరల నిజాం నవాబు చెరనుండి విముక్తి చేసి గ్రామ కమిటీ లు వేసిన చరిత్ర సిపిఐ కి ఉన్నదని ఆయన అన్నారు.అంతటి మహాత్తర చరిత్ర వున్న సిపిఐ జాతీయ మహాసభలు ప్రక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లోని మనకు దగ్గరగా వున్న విజయవాడ పట్టణంలో జరగటం మన అదృష్టం అని ఆ మహాసభలలో లక్షలాది మంది ప్రజలు పాల్గొంటారని వారితో పాటు మనము కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ మహాసభలకు రంగాపురం గ్రామం నుండి 80 మందిని తీసుకెళ్లాలని గ్రామ కమిటీ నిర్ణయం తీసుకుంది.ఈ కార్యక్రమంలో మండల కార్యవర్గ సభ్యులు కడియాల అప్పయ్య, గ్రామ సిపిఐ కార్యదర్శి తిరగమళ్ళ కిరణ్, కట్టా అశోక్, పగడాల శ్రీనివాస్, దారా సిల్వ, రెడిమళ్ళ బాల సౌరీ, వానరసి బంగారి, వానరసి నాగులు, పగడాల బాబు, బూర సతీష్, ఉయ్యాలా అంజయ్య, తదితరులు పాల్గొన్నారు.