కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలి.

తూప్రాన్( జనం సాక్షి )జూన్ 19::
 విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని హార్ట్ టు హెల్ప్ చారిటబుల్ ట్రస్ట్ కో ఆర్డినేటర్ మూడే రవినాయక్ పేర్కొన్నారు మంగళవారం స్థానిక బాలుర ఉన్నత పాఠశాలలో తల్లిదండ్రులను కోల్పోయి చదువుకుంటున్న విద్యార్థులకు నోటు పుస్తకాలను పంపిణీ సందర్బంగా ఆయన మాట్లడుతూ గత 12 సంవత్సరాలుగా వివిధ రంగాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.పేద విద్యార్థులకు తమ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పుస్తకాలు,ఫీజులు,యూనిఫామ్ లు అందించడం జరుగుతుందని తెలిపారు. నేడు పాఠశాలలో 26 మంది విద్యార్థులకు ఆరు నోటుపుస్తకాలతో కూడిన సెట్ ను అందించడం జరుగుతుందని తెలిపారు.భవిష్యత్తు లో మరిన్ని సేవా కార్యక్రమాలు పాఠశాల విద్యార్థులకు అందించనున్నట్లు తెలిపారు.
అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వెంకట లక్ష్మీ మాట్లాడుతూ చదువు మాత్రమే విద్యార్థుల భవిష్యత్తును మార్చగలుగుతుందని అన్నారు. పేద విద్యార్థులకు హార్ట్ టు హెల్ప్ చారిటబుల్ ట్రస్ట్ నోటుపుస్తకాలను అందించడం చాలా గొప్ప విషయమని అన్నారు. హెచ్ టు హెచ్ సంస్థ ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తు, నేడు పాఠశాలలో  26 మంది విద్యార్థులకు నోటు పుస్తకాలు అందజేస్తున్న  మూడే రవినాయక్ ను అభినందించారు. ఈ
కార్యక్రమంలో ఉపాధ్యాయులు సాయిరెడ్డి, యోహాన్,దుర్గారెడ్డి, మధుసూదనరావు,చంద్రారెడ్డి, రమేష్ గంగాల, శ్రీనివాస రావు, ప్రభాకర్,సురేష్ కుమార్,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.