కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతి
గుడిహత్నూర్: అక్టోబర్ 2 జనం సాక్షి) మండలంలోని తోషం గ్రామంలో మహాత్మా గాంధీ యూత్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాల్యాల కరుణాకర్ మాట్లాడుతూ శాంతి దూత అహింసావాది మహాత్మా గాంధీ ఎన్నో పోరాటాలు చేసి నిరంతరం అహింస వాదంతో తెల్ల దొరల్నిదేశం నుండి తరిమికొట్టిన స్వతంత్ర ఫలాను భారతదేశానికి అందించిన ప్రాణ త్యాగం చేసినటువంటి గొప్ప మానవత మూర్తి గాంధీ అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ షాహిద్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ సలీం యూత్ ప్రెసిడెంట్ వినోద్ శీను తదితరులు పాల్గొన్నారు