*కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ*
గోపాల్ పేట్ జనం సాక్షి ఆగస్టు(09):*
గోపాల్ పేట్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గ్రామ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాల పిరు జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు శివన్న మాట్లాడుతూ క్విట్ ఇండియా ఉద్యమంలో ఎందరో మహానుభావుల పోరాట ఫలంగా బ్రిటిష్ వారిని ఇండియా నుంచి పారద్రోలి స్వతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీ, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, సుభాష్ చంద్రబోస్, టంగుటూరు ప్రకాశం, దుర్గాబాయి దేశ్ ముక్, నెహ్రూ, వంటి ఎంతోమంది ఉద్యమాలు, పోరాటాలు చేస్తేనే స్వాతంత్రం వచ్చింది అని అన్నారు టిఆర్ఎస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీల ను నెరవేర్చకుండా ప్రజలను మభ్యపెడుతూ రెండు లక్షల రుణమాఫీ చేయకుండా డబల్ బెడ్రూం ఇల్లు ఇవ్వకుండా మరియు నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించకుండా కాలయాపన చేస్తూ దళితులకు మూడెకరాల భూమి ఇవ్వకుండా దళిత బంధు అందరికీ వర్తింప చేయకుండా 57 సంవత్సరాలు నిండిన వృద్ధులకు పెన్షన్ ఇవ్వకుండా టిఆర్ఎస్ పార్టీ ప్రజలను మోసపూరిత హామీలతో మోసం చేస్తుందని ఆయన అన్నారు టిఆర్ఎస్, బిజెపి, ప్రభుత్వాలు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి , అదేవిధంగా నిత్యవసర వస్తువులైన పప్పు,నూనె రేట్లు అధికంగా పెరగడం వల్ల ప్రజల మీద భారం పడిందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు వెంకటేష్, మండల ప్రధాన కార్యదర్శి సుధాకర్ రావు, నాగ శేషు యాదవ్, చంద్రశేఖర్ రెడ్డి ,చాకల్ పల్లి సర్పంచ్ నరహరి, వెంకటయ్య యాదవ్, దేవరాజు, పూసల లక్ష్మణ్, టైలర్ కిషోర్, ప్రేమ్ కుమార్, రవి నాయక్, తదితరులు పాల్గొన్నారు