కామ్రేడ్ అభిబ్ మరణం పార్టీకి తీరని లోటు

నల్లబెల్లి అక్టోబర్ 22 ( జనం సాక్షి):
సిపిఎం పార్టీ సీనియర్ సభ్యులు కామ్రేడ్ ఎండి అబీబ్ మరణం పార్టీకి తీరని లోటని సిపిఎం మండల కమిటీ కార్యదర్శి కడియాల మనోహర్ పేర్కొన్నారు. మండలంలోని మూడు చెక్కలపల్లి గ్రామానికి చెందిన కామ్రేడ్ అబీబ్  మృతి చెందగా వారి సమాధి వద్ద శనివారం నివాళులర్పించారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ పేద ప్రజల కోసం ఏనలేని సేవలు చేశారన్నారు. గిరిజన రైతుల పోడు భూముల పట్టాలు, తునికాకు కూలీల రేట్లు, రేషన్ కార్డుల కోసం పోరాటాలు చేసిన నాయకుడు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా నాయకులు వీరాచారి, బోడిగే సమ్మయ్య, క్రాంతి కుమార్, రమేష్ ,రవి ,నాగేశ్వరరావు, సునీల్ పాల్గొన్నారు.
Attachments area