కారుణ్య నియామకాలు వెంటనే చేపట్టాలి –టిపిటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోత్ హరిలాల్ నాయక్
టేకులపల్లి, సెప్టెంబర్ 29( జనం సాక్షి ): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సంవత్సర కాలం దాటినా కూడా కారుణ్య నియామకాలు చేపట్టకపోవడంతో బాధితులు ఆందోళన చెందుతున్నందున వారికి వెంటనే కారుణ్య నియామకాలలో భాగంగా ఉద్యోగాలు ఇవ్వాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోత్ హరిలాల్ నాయక్ ప్రభుత్వాన్ని కోరారు. ఒక సంవత్సర కాలంగా అన్ని కేడర్లలో ఖాళీలు ఉన్నప్పటికీ ఖాళీలు లేవనే నెపంతో ఆలస్యం చేస్తూ కారుణ్య నియామకాలు చేపట్టడం లేదని, కానీ ఈ మధ్యకాలంలో వీఆర్వోలను జూనియర్ అసిస్టెంట్లుగా వివిధ శాఖలలో కన్వర్ట్ చేయడానికి ఖాళీలు ఎక్కడినుండి వచ్చాయని వారు ప్రశ్నించారు. కారుణ్య నియామకాలలో భాగంగా జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారిని సంవత్సర కాలంగా ఆ పోస్టులలో నియమించకుండా ఇటీవల వీఆర్వోలకు ఆ పోస్టులు ఇవ్వడం సరైంది కాదని,న్యాయంగా కారుణ్య నియామకాలలో దరఖాస్తు చేసుకున్న వారికే జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఇవ్వాల్సి ఉందని వారు తెలిపారు. కుటుంబ పెద్దను కోల్పోయి అనేక ఇబ్బందులలో ఉన్నటువంటి వారికి కారుణ్య నియామకాలు చేపట్టకుండా వీఆర్వోలను ఆ పోస్టులలో భర్తీ చేయడం సరైంది కాదని ,వెంటనే వివిధ పోస్టులకు దరఖాస్తు పెట్టుకున్న వారికి ఆ పోస్టులలో నియామకాలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం గిరిజనులే ఉండడం,వారు అధికారులను అడగకపోవడంతో అధికారులు వారికి ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారని దీనిపై భద్రాద్రి కలెక్టర్ దృష్టి పెట్టాలని వారు కోరారు. ఆరు నెలలకు పైగా ఖమ్మం జెడ్పి కార్యాలయంలో మరో ఆరు నెలలకు పైగా భద్రాద్రి కొత్తగూడెం జడ్పీ కార్యాలయంలో కారుణ�