కార్తీక పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న ఎంపి కవిత

నిజామాబాద్‌,నవంబర్‌23(జ‌నంసాక్షి): కార్తీక పౌర్ణమి సందర్భంగా నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ నియోజకవర్గంలోని నందిపేట్‌ పలుగుట్ట కేదారేశ్వర ఆశ్రమంలో జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఎంపి కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఆర్మూర్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఆశన్నగారి జీవన్‌ రెడ్డితో కలిసి మంగి రాములు మహరాజ్‌ ఆశీర్వాదం తీసుకున్నారు. భక్తులతో కాసేపు ముచ్చటించారు. మహరాజ్‌ భక్తి ఉపదేశం శ్రద్ధతో భక్తులతో కలిసి విన్నారు. ఈ సందర్భంగా ఎంపి కవిత మాట్లాడుతూ మహారాజ్‌ చేస్తున్న ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలను ప్రశంసించారు. ఆర్మూర్‌ ప్రజలు చేసుకున్న జన్మజన్మల పుణ్యఫలం అన్నారు. కేదారేశ్వర ఆలయ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు.