కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థల దిష్టిబొమ్మ దహనం

సూర్యాపేట టౌన్ (జనంసాక్షి):కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థల నిలువు దోపిడీని అరికట్టాలని తెలంగాణ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో స్థానిక తెలంగాణ తల్లి విగ్రహం వద్ద కార్పొరేట్, ప్రవేట్ విద్యాసంస్థల దిష్టి బొమ్మ దహనం చేశారు.ఈ సందర్బంగా ఆ సంఘ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు బారీ అశోక్ మాట్లాడుతూ  రాష్ట్రంలో విచ్చల విడిగా కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థలు విద్యార్థుల పేరెంట్స్ నుండి ఐఐటి, జేఈఈ, టెక్నా, కరికులం, ఓలంపియాడ్ తదితర పేర్లతో, బుక్స్, యూనిఫామ్ పేరుతో లక్షలాది రూపాయలు వసూలు చేస్తూ విద్యని వ్యాపారంగా మారుస్తున్నారని అన్నారు.అధికారులు, ప్రజాప్రతినిధులు ఏ మాత్రం పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు చోద్యం చూస్తున్నారని అన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం,విద్యాశాఖ అధికారులు కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థల దోపిడీని అరికట్టాలని అన్నారు.ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించకపోతే తమ సంఘం ఆధ్వర్యంలో  రాష్ట్ర మంత్రుల ఇళ్లను ముట్టడిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో సంఘ జిల్లా ఇంచార్జి కొల కరుణాకర్, గడ్డం ఉపేందర్, గిరిజన శక్తి జిల్లా నాయకులు రాహుల్, గుండు సైదులు, రమేష్ నాయక్, రాజేంద్ర, దశరధ, మచ్చు సురేష్, నరేష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
 

తాజావార్తలు