కార్మికుడు ప్రమాదవశాత్తు జారిపడి మృతి

నాచారం, హైదరాబాద్‌ : నిర్మాణంలో ఉన్న నాచారం ఈఎస్‌ఐ ఆసుపత్రి భవనం 8వ అంతస్తు నుంచి ఓ కార్మికుడు ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందాడు. మృతున్ని బీహార్‌కు చెందిన పురానా (18) అనే యువకుడిగా గుర్తించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి విచారణ చేపట్టారు.