కార్మికుల శ్రమశక్తిని కార్పొరేట్లకు దోచిపెడుతున్న మోడీ.

–IFTU రాష్ట్ర కోశాధికారి రాసుద్దిన్.

టేకులపల్లి, జూలై 27( జనం సాక్షి ): దేశంలోని 60 కోట్లమంది కార్మికుల శ్రమశక్తిని కార్పొరేట్ సంస్థలకు మోడి ప్రభుత్వం దోచి పెడుతున్నదని ఇందులో భాగంగానే 44 కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్ లను తీసుకువచ్చారని, కార్మికులకు కనీస వేతనాలు లేకుండా కోట్లాది మందికి ద్రోహంచేస్తున్నారని, కార్పొరేట్ సంస్థల సంపాదన పెంచడమే లక్ష్యంగా బిజెపి ప్రభుత్వం పనిచేస్తున్నదని భారత కార్మిక సంఘాల సమాఖ్య రాష్ట్ర కోశాధికారి ఎండి.రాసుద్దిన్  అన్నారు. బుధవారం ఐ ఎఫ్ టి యు జిల్లా నాయకులు పోలు లింగయ్య అధ్యక్షతన జరిగిన హమాలీ వర్కర్స్ యూనియన్ జనరల్ బాడీ సమావేశం జరిగింది. కార్మిక వ్యతిరేక విధానాలపై నిరంత పోరాటాలకు సిద్ధంకావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ నెల 31న హైదరాబాదులో ఐఎఫ్టియు భాగస్వామ్యం ఐ ఎఫ్ టి యు- మాసా ఆధ్వర్యంలో దక్షిణ భారత రాష్ట్రాల కార్మిక సంఘాల సదస్సు నిర్వహిస్తున్నందున దానిని జయప్రదం చేయాలని ఆయన విజ్ఞప్తిచేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న రాసుద్దిన్ మాట్లాడుతూ దేశానికి, ప్రజలకు లాభంచేసే చర్యలను మోడీ ప్రభుత్వం చేపట్టడంలేదని అంబానీ, ఆదాని,గుజరాత్ పెట్టుబడిదారులకు పెట్రోలు,డీజిల్, గ్యాస్,బొగ్గు,ఇనుము తదితర సంపదలతో పాటు విమానయానం బ్యాంకులు, ఇన్సూరెన్స్, డిఫెన్స్,రైల్వే తదితర సంస్థలను అప్పగిస్తున్నారని విమర్శించారు. దేశప్రజలు తిండిలేక ఆకలితో చూస్తుంటే పట్టించుకోని మోడీ కార్పొరేట్లు, బడా పెట్టుబడిదారులు బ్యాంకుల నుండి తీసుకున్న లక్షల కోట్ల రూపాయలను రద్దు చేస్తున్నారని పేర్కొన్నారు.  కార్మిక వర్గం మనగడ కోసం పోరాడక తప్పదని గుర్తు చేస్తూ అనేక దశాబ్దాలుగా కార్మిక వర్గం హక్కులకోసం,సౌకర్యాల కోసం పోరాటాలు నిర్వహించి విజయాలు సాధించిన చరిత్రను  నేటి కార్మిక వర్గం ఆదర్శంగా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈనెల 31న దక్షిణ భారత రాష్ట్రాల రీజనల్ సదస్సు నిర్వహిస్తున్నట్లు అనంతరం నవంబర్లో చలో రాష్ట్రపతి భవన్ కార్యక్రమం నిర్వహించబోతున్నట్లు ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి రామ్సింగ్, పోలు లింగయ్య, ఐలయ్య, సమ్మయ్య, సంపత్, రవి తదితరులు పాల్గొన్నారు.

Attachments area