కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాటాలు చేసేది ఏఐటీయూసీ
గరిడేపల్లి, అక్టోబర్ 1(జనం సాక్షి): కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటం నిర్వహించడంలో ఏఐటీయూసీ ముందున్నదని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల శ్రీనివాస్ అన్నారు.భారతదేశంలో నూరు సంవత్సరాల చరిత్ర కలిగిన కార్మిక సంఘం ఏఐటీయూసీ మాత్రమే నని స్వాతంత్ర్యం కంటే ముందు బ్రిటిష్ వారితో కొట్లాడి ఎనిమిది గంటల పని విధానం తీసుకొచ్చింది ఏఐటీయూసీ అని స్వాతంత్ర్య పోరాటంలో కూడా ఏఐటీయూసీ కీలక పాత్ర పోషించిందని ఆయన అన్నారు. స్వాతంత్ర్యం అనంతరం పాలక పార్టీలు అవ్వలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానలపై పోరాడి కార్మికులకు అనుకూలంగా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుతో అనేక చట్టాలను సాధించిన చరిత్ర ఏఐటీయూసీ అని ఆయన అన్నారు. మనం పోరాడి సాధించిన కార్మిక చట్టాలకు తూట్లు పొడవటానికి కేంద్రం అధికారంలో బిజెపి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని దానికి వ్యతిరేకంగా కార్మికులు అందరు ఐక్య పోరాటాలు నిర్వహించాలని ఆయన కోరారు.ఈ మహాసభకు అధ్యక్ష వర్గంగా ఏఐటీయూసీ సీనియర్ నాయకులు షేక్ పెద్ద మస్తాన్, కార్పెంటర్స్ వర్కర్స్ యూనియన్ నాయకులు అప్పాచారి నిర్వహించగా కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు జడ శ్రీనివాస్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పోకల వెంకటేశ్వర్లు, భవన నిర్మాణ కార్మిక జిల్లా అధ్యక్షులు జెట్టి ప్రసాద్, ఏఐటీయూసీ జిల్లా నాయకులు త్రిపురం సుధాకర్ రెడ్డి, ఏఐటీయూసీ మండల అధ్యక్షులు బెజ్జం రమేష్, యడవల్లి వెంకటేశ్వర్లు, ఆనందరావు, సతీష్, నకిరేకంటి రవి, మాచర్ల రవి, సిపిఐ మండల కార్యవర్గ సభ్యులు కడియాల అప్పయ్య, యడ్ల అంజిరెడ్డి, ప్రతాని సైదులు, తిరుపయ్య తదితరులు పాల్గొన్నారు.