కాళేశ్వరం కేసు సీబీఐకి అప్పజెప్పినా కేంద్రంలో మౌనమెందుకు?
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై రాహుల్ ఎందుకు మాట్లాడాలి?
` కేటీఆర్ విమర్శలపై మండిపడ్డ పిసిసి చీఫ్
హైదరాబాద్(జనంసాక్షి):ఓట్ చోరీ గురించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆధారాలతో నిరూపించారని టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. దేశవ్యాప్తంగా దీనిపై ఉద్యమిస్తున్న వేళ రాహుల్‌కు మద్దతు పెరిగిందని అన్నారు. మోడీ ఈ విషయంలో అడ్డంగా దొరికారని అన్నారు. ఓ జాతీయ అంశంపై పోరాటం చేస్తుంటే..బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేల గురించి రాహుల్ ఎందుకు మాట్లాడాని ఆయన ప్రశ్నించారు. ఈ సందర్భంగా గాంధీభవన్ లో ఆయన విూడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరం సిబిఐకి అప్పజెప్పినా కేంద్రంలో ఎందుకు కదలిక లేదని అన్నారు. ఫార్ములా- ఈ కార్ రేసు కేసులో బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కు జైలు ఖాయం అని అన్నారు. ఢల్లీిలో బిఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే హరీష్ రావు, కెటిఆర్, నరేంద్ర మోడిని కలిశారని తెలియజేశారు. వాళ్లు బిజెపిలో చేరినట్లు- తాము కూడా నోటీసులు పంపిస్తామని, సిఎంగా రేవంత్ రెడ్డిని అందరూ కలుస్తారని మహేష్ పేర్కొన్నారు. ఫిరాయింపులపై రాహుల్ స్పందించాలని కెటిఆర్ అంటున్నారని చెప్పారు. రాహుల్ పై మాట్లాడే అర్హత కెటిఆర్ కు ఉందా? అని ప్రశ్నించారు. కాళేశ్వరంపై సిబిఐ విచారణ తప్పించుకోవడానికే.. ఉపరాష్ట్రపతి ఎన్నికకు బిఆర్‌ఎస్ దూరంగా ఉందని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.