కిరణ్‌ సీమాంధ్రకే సీఎం మరోమారు బుద్ధిబయటపెట్టుకుండు

వైకాపా కేసులెత్తేసి ఉద్యమకారులపై కేసులు పెడుతావా

మండిపడ్డ టీ కాంగ్రెస్‌ ఎంపీలున్యూఢిల్లీ, డిసెంబర్‌ 19 (జనంసాక్షి) :

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మరోమారు తన బుద్ధి బయట పెట్టాడని టీ కాంగ్రెస్‌ ఎంపీలు మండిపడ్డారు. బుధవారం వారు ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. పులివెందులలో వైఎస్సార్‌ సీపీ నాయకులపై నమోదైన కేసులను ఎత్తివేసి తెలంగాణవాదులపై పెట్టిన కేసులను మాత్రం అలాగే ఉంచారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు కాంగ్రెస్‌ పార్టీని, అధినేత్రి దుమ్మెత్తిపోసే వైకాపాపై కేసులు ఎత్తివేయడంలో ఆంతర్యమేమిటని వారు ప్రశ్నించారు. సీమాంధ్ర నేతలంతా ఒక్కటే అనడానికి ఈ సంఘటన అద్దం పడుతోందని రాలేదని కోదండరాం వెల్లడించారు. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ విషయమై అందరి అభిప్రాయాలు తీసుకున్న తరువాతే దీనిపై నిర్ణయం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. జేఏసీ భవిష్యత్తు కార్యాచరణను ఆయన ప్రకటించారు. ఈనెల 23న కేంద్రం తన ప్రకటనను వెనుక్కు తీసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని విద్రోహ దినంగా పాటించాలని, ఆ రోజు నల్లజెండాలు, నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తామన్నారు. 26న తెలంగాణలోని అన్ని మండల కేంద్రాల్లో దీక్షలు చేపడతామన్నారు. 27 ఉదయం ఇందిరాపార్కు వద్ద భారీ ఎత్తున నిరసన దీక్ష ప్రారంభించి 28 ఉదయం 8 గంటల వరకు కొనసాగిస్తామన్నారు. 28న ఢిల్లీలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమాల్లో జేఏసీ భాగస్వామ్య పక్షాలు, కుల సంఘాలు అన్ని పాల్గొంటాయని ఆయన వెల్లడించారు. 28న అఖిలపక్ష సమావేశంలో పార్టీల వైఖరిని బట్టి భవిష్యత్తు కార్యాచరణను రూపొందించనున్నట్టు ఆయన వెల్లడించారు. ఈ వరుస కార్యక్రమాలతో కాంగ్రెస్‌ పార్టీతో సహా అన్ని పార్టీలపై ఒత్తిడి పెంచే లక్ష్యంతో శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. శాంతియుతంగా తెలంగాణ రావాలంటే ఈ అఖిపక్షమే చివరి సమావేశం కావాలని కేంద్రానికి కూడా ఇది చివరి అవకాశమని ఆయన పేర్కొన్నారు. ఉద్యమాల సందర్భంగా పోలీసులు కూడా సంయమనంతో పాటించాలంటూ ఆయన విజ్ఞప్తి చేశారు. టీయూఎఫ్‌ నాయకురాలు విమలక్క విడుదలపై జేఏసీ స్పందించడంలేదంటూ వస్తున్న విమర్శలపై ఆయన స్పందిస్తూ తాము ఆ విషయంపై చర్చించలేదనేది అవాస్తవమని ఖండించారు. తామెప్పుడో విమలక్కను విడుదల చేయాలని డిమాండ్‌ చేసినట్టు చెప్పారు. ఉద్యమానికి తెలంగాణ ప్రజలు సన్నద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశంలో వివిధ పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.