కిశోర బాలికలకు పౌష్టికాహారం అవసరం

వినుకొండ, జూలై 28 : కిశోర బాలికలు పోషకాహారం తీసుకోవాలని ఈపూరు ప్రాజెక్టు సిడిటివో స్వరూప రాణి అన్నారు. శనివారం నాడు మహిళా శిశు చైతన్య ప్రచారంలో భాగంగా ఆమె బొల్లాపల్లి మండల కేంద్రంలోని ఎస్సి కాలనీలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో మాట్లాడారు. యవ్వన దశలో బాలికల్లో ఆహారం, పోషక స్థితిగతుల సమస్యల గురించి ఆమె వివరించారు. బాల్య వివాహాలు బలవంతంగా జరిపిస్తే, చట్ట రిత్య చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. ఆడబిడ్డను పెంచలేని తల్లిదండ్రులు అంగన్‌వాడీ కేంద్రాల్లోని ఊయల్లో ఉంచాలని అన్నారు. పౌష్టికాహారం లోపంతో మాతా శిశు మరణాలు నివారించేందుకు కృషి చేయాలని అన్నారు. పౌషికాహారం లోపంతో పెరుగుదలలో మార్పులు వస్తాయని దీనితో ఆరోగ్యకరమైన సమస్యలు తలెతుతాయని అన్నారు. కావున పౌష్టికాహారం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో బొల్లాపల్లి సూపర్‌వైజర్‌ సుశీల, దేవమణి, సరోజిని, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు తదితరులు పాల్గొన్నారు.