కుటుంబ వ్యవస్థలో మార్పు రావాలి.. – ఆడ మగ బేధాలు వద్దు

– ఆడ మగ బేధాలు వద్దు

– వివక్షతను రూపు మాపాలి

– విద్యా హక్కు చట్టాన్ని
వినియోగించుకోవాలి

– ప్రతిభ చాటిన 20 మందికి నగదు పురస్కారం

– బాల బాలికల సంరక్షణలో అధికారులు అంకిత భావంతో పనిచేయడం అభినందనీయం

– ఘనంగా అంతర్జాతీయ బాలికా దినోత్సవ వేడుకలు

– అదనపు కలెక్టర్ జీ సంధ్యారాణి…

హన్మకొండ బ్యూరో చీఫ్ 11అక్టోబర్ జనంసాక్షి

సనాతన సాంప్రదాయాలతో స్త్రీలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చే దేశం మనదని అలాంటి సత్ సాంప్రదాయాల దేశంలో ఆడపిల్లలపై వివక్ష కొనసాగడం బాధాకరమని
అదనపు కలెక్టర్ జీ సంధ్యారాణి అన్నారు, అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం రోజున హనుమకొండ జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా బాలల పరిరక్షణ అధికారి పి సంతోష్ కుమార్ అధ్యక్షతన జరిగిన వేడుకలకు అదనపు కలెక్టర్ సంధ్యారాణి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఆడ మగ అనే తేడాలు పిలిచే పిలుపులో ఉండాలి తప్ప చూపించే ప్రేమలో ఉండకూడదని,ఆడ మగ బండికి ఇరువైపులా ఉండే చక్రాల్లాంటి వారని ఏ ఒక్కరూ లేకపోయినా ముందుకెళ్లరని, సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఆడ పిల్లలు వివక్షకు గురవుతున్నారని అన్నారు,గ్రామీణ ప్రాంతాలలో ఈ వివక్ష ఎక్కువగా ఉన్నదని ఈ జాఢ్యాన్ని రూపు మాపాలంటే ముందు కుటుంబ వ్యవస్థలో మార్పు రావాలని అందుకు ప్రతి ఒక్కరూ కంకణ బద్దులు కావాలని అన్నారు.
గర్భంలో పెరుగుతున్నది ఆడ పిల్ల అని తెలియగానే గర్భ విచ్ఛిత్తికి పాల్పడడం జరుగుతుందని ఈ అసాంఘీక చర్యలకు అడ్డు కట్ట వేయడానికి 1994 గర్భస్థ లింగ నిర్ధారణ నిరోధక చట్టం 2003 లో అమెండ్మెన్ట్ చట్టం వచ్చిందని చట్టానికి విరుద్ధంగా నిర్వహించే కేంద్రాలపై నిఘా ఉంచాలని బాధ్యులపై చర్యలకు వైద్యారోగ్య పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉండాలని అన్నారు, అవసరమైతే సదరు కేంద్రాల లైసెన్స్ లు రద్దు చేయాలని సూచించారు,
ఆడ పిల్లలను వద్దనుకుంటే వారిని ప్రభుత్వానికి అప్పగిస్తే వారి బాధ్యత చూసుకుంటుందని అన్నారు, ఆడ పిల్లలకు రక్షణ సంరక్షణ కల్పించుటకు విద్యాహక్కు చట్టం, బాల్య వివాహ నిరోధక చట్టం,లైంగిక నేరాలనుండి రక్షించే చట్టం మరియు బాల కార్మిక నిర్మూలన చట్టం,బాలల అక్రమ రవాణా చట్టం వీటి అమలుకు పోలీస్, వైద్యారోగ్య శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ, కార్మిక శాఖ,విద్యా శాఖలు ఉన్నాయని వారికి అనుసంధానంగా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, బాలల న్యాయ మండలి ఉన్నదని తెలియచేసారు.
ఆడ పిల్లలకు కస్తూర్బా గాంధీ విద్యాలయాలు మరియు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంక్షేమ గురుకుల పాఠశాలలున్నాయని చిన్న నాటి నుండే లక్ష్యం దిశగా అడుగులు వేసి ఇష్టపడి చదివి ప్రయోజకులు కావాలని ఆకాంక్షించారు.
బాలికల సంరక్షణలో బాలల హక్కులు కాపాడటంలో అంకిత భావంతో పనిచేస్తున్న అధికార యంత్రాంగాన్ని ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ అభినందించారు.
ఆర్జేడీ లక్ష్మి బాయి మాట్లాడుతూ జిల్లాలోని 3 ఐసిడిఎస్ ప్రాజెక్ట్ పరిధి గ్రామాలలో బాల బాలికలకు ఏ చిన్న సమస్య రాకుండా గ్రామ మండల పట్టణ స్థాయి కమిటీల సమన్వయంతో పని చేస్తున్నామని అధికారుల ఆదేశాల మేరకు సమస్యలు ఉత్పన్నం కాకుండా ప్రజల్లో అవగాహన కల్పించడం వలన ఆశించిన మార్పు కోసం ఎదురు చూస్తున్నామని అన్నారు.
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సాంబశివరావు మాట్లాడుతూ మహిళాభివృద్ధి శిశు సంక్షేమ, పోలీస్, మరియు చైల్డ్ లైన్ సమన్వయంతో లింగ నిర్ధారణ నిరోధక చట్టం పై గ్రామీణ ప్రాంతాలలో విస్తృత స్థాయిలో ప్రచారం చేయడం జరుగుతుందని, తద్వారా 2011 జనాభా లెక్కల ప్రకారం 923 కు ఉన్న సెక్స్ రేషియో ను 2020- 2022 వరకు 951 వరకు పెరిగిందని, చట్ట విరుద్ధంగా పాల్పడే కేంద్రాలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచి సమస్యలకు తావు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.
చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్ పర్సన్ అన్నమనేని అనిల్ చందర్ రావు మాట్లాడుతూ రక్షణ సంరక్షణ కోసం చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ని ఆశ్రయించే ప్రతి బాలుడు బాలికకు సేవలు అందిస్తున్నామని, సంక్షేమ గురుకుల పాఠశాలలో ప్రవేశాలు కల్పించుట చర్యలు తీసుకున్నామని అన్నారు.
జిల్లా బాల పరిరక్షణ అధికారి పి సంతోష్ కుమార్ మాట్లాడుతూ బాల రక్షణ సంరక్షణ ధ్యేయంగా అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో పనిచేస్తున్నామని అన్నారు.
కార్యక్రమంలో జిల్లా ఇంటర్మీడియట్ విద్యా అధికారి ఏ గోపాల్, ఎన్సిఎల్పి పిడి బుర్ర అశోక్ కుమార్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు పి హైమావతి, కే దామోదర్, పరికీ సుధాకర్, బాలల న్యాయ మండలి సభ్యులు మెరుగు సుభాష్, కే గోపికా రాణి, డెమో వి అశోక్ రెడ్డి, హెచ్ఈఈవో ఎల్ చంద్ర శేఖర్, సిడిపివో లు కే మధురిమ, భాగ్య లక్ష్మి, జీసిఈవో జయ, యూడీసీ వి వెంకట్ రామ్,
ప్రొటెక్షన్ ఆఫీసర్
ఎస్ ప్రవీణ్ కుమార్,
ఎం మౌనిక, చైల్డ్ లైన్ కో ఆర్డినేటర్ రాగి కృష్ణ మూర్తి,బాలల పరిరక్షణ విభాగం
ఏ మాధవి, మెరుగు శ్రీనివాసులు, జీ సునీత,
పి విజయ్ కుమార్,
ఎం శివ ప్రసాద్, సునీల్, బాల సదనం పర్యవేక్షణ అధికారి కల్యాణి, వివిధ శాఖల అధికారులు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు, ఈ సందర్భంగా 2020 2021 విద్యా సంవత్సరానికి గాను 10 వ తరగతి, ఇంటర్మీడియట్ లో అత్యధిక మార్కులు సాధించిన 20 మంది విద్యార్థినీలకు ఒక్కొక్కరికి 5000/- చొప్పున నగదు పురస్కారం అందచేసార.