కుప్పకూలి కోర్టులోనే పడిపోయిన శంకర్‌రావు
` రెండు కేసుల్లో దోషిగా ప్రకటించడంతో కోర్టు హాలులోనే స్పృహ తప్పి పడిపోయిన మాజీ మంత్రి
హైదరాబాద్,జనవరి 12(జనంసాక్షి): మాజీమంత్రి శంకర్ రావుకు రెండు కేసుల్లో ప్రజా ప్రతినిధుల కోర్టు జరిమానా విధించింది. ఓ కేసులో 2వేల రూపాయలు, మరో కేసులో రూ.1500 జరిమానా చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది. భూ వివాదంలో అక్రమంగా చొరబడి.. బెదిరించారన్న అభియోగంపై షాద్‌నగర్‌లో నమోదైన కేసులో తీర్పు వెల్లడిరచింది. ఓ మహిళ ఇంట్లోకి అక్రమంగా చొరబడి బెదిరించారన్న కేసులోనూ తీర్పునిచ్చింది. రెండు కేసుల్లోనూ దోషిగా ప్రకటించడంతో శంకర్‌రావు కోర్టు హాలులోనే స్పృహ తప్పి పడిపోయారు. న్యాయవాదులు, కోర్టు సిబ్బంది ఆయన్ను లేపి నీళ్లు తాగించడంతో కోలుకున్నారు. షాద్‌నగర్‌లో నమోదైన మరో బెదిరింపు కేసులో తగిన ఆధారాలు లేకపోవడంతో న్యాయస్థానం కొట్టివేసింది.