కుమ్ర రాజు కి శ్రద్ధాంజలి ఘటించిన నాయకులు

జనం సాక్షి. ఉట్నూర్
తెలంగాణ రాష్ట్ర మహిళ కమీషన్ సభ్యురాలు శ్రీ కుమ్ర ఈశ్వరి బాయి భర్త కుమ్ర రాజు (టీచర్) గారు గత వారం రోజుల క్రితం గుండెపోటు తో చనిపోవడం తో విషయం తెలుసుకున్న   తెరాస మైనార్టీ నాయకులు యూనిస్ అక్బనీ ఆదివారం రోజున ఇంద్రవెళ్లి లోని వారి స్వగృహానికి వెళ్లి ఈశ్వరి బాయి గారిని పరామర్శించారు.ఈ సందర్భంగా రాజు గారి  చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు.ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని వేడుకున్నారు కార్యక్రమంలో జడ్పి కో అప్షన్ సభ్యులు మహమ్మద్ అంజాద్, నాయకులు సూఫీయాన్,శేఖర్ బాబు,మెస్రం లింగు, మెస్రం సోనెరావ్, తదితరులు ఉన్నారు.