కులమతాలకతీతంగా చీరల పంపిణీ

మెదక్ జడ్పీ చైర్పర్సన్ హేమలత శేఖర్ గౌడ్ తూప్రాన్ జనం సాక్షి సెప్టెంబర్ 23 :: కుల మతాలకు అతీతంగా కేసీఆర్ ప్రభుత్వం చీరలు పంపిణీ చేస్తుందని మెదక్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి హేమలత శేఖర్ గౌడ్ పేర్కొన్నారు మనోహారబాద్ మండలంలోని కాళ్లకల్ ,చెట్ల గౌరారం గౌతోజిగుడెం గ్రామలలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై చీరలను పంపిణీ చేశారు. చెట్ల గౌరరం అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు అందిస్తున్న పౌష్టిక ఆహారాన్ని పరిశీలించారు. సభలో ఆమె మాట్లాడుతు తెలంగాణ ప్రభుత్వం కుల,మత బేధం లేకుండా ముస్లిం లకు రంజాన్ కు , క్రైత్సవులకు క్రిస్మస్ కు , హిందువులకు దసర కు బట్టలు పంపిణీ చేస్తున్నామన్నారు అన్ని వర్గాల ప్రజలకు ఆదుకునే ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం అని ఆమె పేర్కొన్నారు కెసిఆర్ ప్రభుత్వ హామీలు అనే గ్రామాల లో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని గతంలో ఎన్నడు విధంగా కొత్త పథకాలను ప్రవేశపెట్టి ఘనత కెసిఆర్ కి దక్కుతుందని ఆమె కొనియాడారు కార్యక్రమాలలో ఎంపీపీ పురం నవనీత రవి , వైస్ ఎంపీపీ విట్టల్ రెడ్డి ఎంపీడీవో యాదగిరి రెడ్డి , మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పురం మహేష్ ఏపీఎం పెంట గౌడ్ ,ఎంపీటీసీ లావణ్య సర్పంచులు నత్తి మల్లేష్ నరసయ్య వెంకటేశ్వర్లు ఉప సర్పంచ్లు రాజు యాదవ్ , శ్రీహరి గౌడ్ జిల్లా ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు, రేణు కుమార్ నాయకులు శ్రీరామ్ కాళిదాస్ తదితరులు పాల్గొన్నారు.