కృత్రిమ గర్భధారణ ద్వారా పశుగణాభివృధ్ధి

 

-డా||జి.వి.రమేష్,జిల్లా పశు వైద్య మరియు పశుసంవర్ధక అధికారి….

నాగర్ కర్నూల్ రూరల్:జులై 20(జనంసాక్షి)

పాడి పశువులకు సరైన సమయంలో కృత్రిమ గర్భధారణ చేసినట్లైతే మేలు జాతి దూడలు జన్మించి పాడి పరిశ్రమ లాభసాటిగా ఉంటుందని జిల్లా పశు వైద్య మరియు పశు సంవర్ధక అధికారి డా,జి.వి.రమేష్ పేర్కొన్నారు.నాగర్ కర్నూలు మండలం మల్కపుర్ గ్రామంలో పశు వైద్య శిబిరం ప్రారంభించి రైతులను ఉద్దేశించి మాట్లాడారు.జిల్లాలో 89పశువైద్య కేంద్రంలు,61గోపాల మిత్ర కేంద్రాలలో ఘనీ కృత వీర్యం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని తెలిపారు.రైతులు ఎద లక్షణాలు గమనించి,పశువు ఎదకు వచ్చిన 12నుండి 24గంటల మధ్యలో కృత్రిమ గర్భధారణ ఇంజెక్షన్ చేసినట్లైతే పశువులు చూడి కడతాయి అన్నారు.ముఖ్యంగా బర్రెలలో మూగ ఎద ఎక్కువగా ఉంటుంది కాబట్టి బర్రెలను ఉదయం మరియు సాయింత్రం గమనించాలి.ఎద ఇంజెక్షన్ చేసిన పశువులకు 2 నెలల తరువాత చూడి నిర్ధారణ పరీక్ష చేయించాలి.చూడి నిర్ధారణ అయిన పశువు ఈనే 3నెలల ముందు పాలు పితకటం ఆపివేయాలని.చూడి పశువుకు అదనంగా మిశ్రమ దానా,ఖనిజ లవణ మిశ్రమాన్ని అందించాలి.దీనివల్ల పశువులు ఆరోగ్యంగా ఉంది,బలిష్టమైన దూడకు జన్మనిచ్చి,ఈతలో ఎక్కువ పాల దిగుబడి వస్తుంది అని తెలియచేశారు.”ఉచిత పశు వైద్య శిబిరం”లో ఏదకు రాని పశువులు,గర్భ కోశ వ్యాధులు,ఇతర వ్యాధులు ఉన్న 95పశువులకు చికిత్సలు చేశారు.అదే విధంగా ప్రభుత్వం నుండి సంవత్సరానికి రెండుసార్లు గాలికుంటు టీకాలు,గొంతువాపు,జబ్బ వాపు టీకాలు ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రజిత,పశువైద్యఅధికారి డా,కల్పన,వెటర్నరీ అసిస్టెంట్ పి.శ్రావణి,గోపాల మిత్రులు,రైతులు పాల్గొన్నారు