కృషి విజ్ఞాన కేంద్రం మామునూరు, శాస్త్రవేత్తల బృందం కన్నాయిగూడెం గ్రామం ములుగు జిల్లాలోని పంచాయతీ చెరువులను కేంద్ర అధిపతి డాక్టర్. ఎన్. రాజన్న ఆధ్వర్యంలో జరిగింది.
కృషి విజ్ఞాన కేంద్రం మామునూరు, శాస్త్రవేత్తల బృందం కన్నాయిగూడెం గ్రామం ములుగు జిల్లాలోని పంచాయతీ చెరువులను కేంద్ర అధిపతి డాక్టర్. ఎన్. రాజన్న గారి ఆధ్వర్యంలో జరిగింది. ఈ పర్యటనలో కన్నాయిగూడెం గ్రామపంచాయతీ చెరువులో చేపలకు సోకిన వ్యాధిని, ఎర్ర పుండ్ల వ్యాధిగా నిర్ధారించడం జరిగింది. మరియు ఎర్ర పుండ్ల వ్యాధిని ఒంటిపైన ఎరుపు మచ్చల ద్వారా గుర్తించవచ్చు అన్నారు. నీటి యాజమాన్యం సరిగా లేనప్పుడు ఈ వ్యాధి సోకుతుంది అని తెలిపారు అలాగే వీటిని వాడుకలో ఉన్న ఆంటీబయాటిక్స్ ని వాడి నివారించవచ్చును అన్నారు ఈ వ్యాధి ప్రథమ దశలో ఉన్నప్పుడు గుర్తిస్తే సెకండరీ జబ్బులు రాకుండా ఉంటాయని సూచించారు. అలాగే ఈ వ్యాధి నివారణకు సంబంధించిన మందులు కూడా ఇవ్వడం జరిగింది. కన్నాయిగూడెంలోని మరొక గ్రామపంచాయతీ చెరువుని సందర్శించి చేపలు పెరుగుతున్న విధానాన్ని పరిశీలించడం జరిగింది. దీనిలో భాగంగా సహజసిద్ధ చెరువుల యాజమాన్యం మరియు చేపల అధిక దిగుబడికి సహజ సిద్ధ మేత తయారీ విధానం, పసరు గ్రౌండ్స్ ఏర్పాటుకు కావలసిన జీవ ఎరువులను వాడుకునే విధానాన్ని మత్స్య శాస్త్రవేత్త డాక్టర్ ఎం. శ్యాం ప్రసాద్ సూచించారు. అలాగే చేప పిల్లల ఎంపిక ప్రభుత్వం ద్వారా అందుతున్న పథకాలు కృషి విజ్ఞాన కేంద్రం అధిపతి డాక్టర్. ఎన్. రాజన్న మరియు డాక్టర్. బి. రవీందర్ శాస్త్రవేత్తలు వివరించారు