కృష్ణవేణి పాఠశాలలో ముందస్తు హోలీ వేడుకలు
రుద్రంగి మార్చి 6 (జనం సాక్షి)
రుద్రంగి మండల కేంద్రంలో సోమవారం స్థానిక కృష్ణవేణి పాఠశాలలో ముందస్తు హోలీ వేడుకలను నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పాఠశాాల మహిళ ఉపాధ్యాయులు ఒకరికొకరు వివిధ రంగులు చల్లుకొని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రిన్సిపాల్ హరినాథ్ రాజ్ మాట్లాడుతూూ… దేశమంతా సమైక్యంగా నిర్వహించుకునే పండుగ హోలీ అని తెలిపారుు.అదేవిధంగా ఎటువంటి హానికరమైన రంగులు మరియు కోడిగుడ్లు వాడరాదని విద్యార్థులకు తెలిపారు. అదేవిధంగా పాఠశాల కరస్పాండెంట్ ఎలిగేటి నరేష్ విద్యార్థులకు,తల్లిదండ్రులకు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు హోలీ శుభాకాంక్షలుుతెలిపారుు.ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు తీపి రెడ్డి వెంకట్ రెడ్డి, ఎర్రం గంగ నరసయ్య,పడాల సురేష్,ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.