కెసిఆర్‌ కుట్రలో భాగమే సాగర్‌ ఉద్రిక్తత

కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే నీటి పంపకాలు
సమస్యను సజావుగా పరిష్కరిస్తామని హావిూ
కొడంగ్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న రేవంత్‌
కొడంగల్‌,నవంబర్‌30 (జనంసాక్షి) : నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు దగ్గర ఉద్రిక్తతలు కేసీఆర్‌ కుట్ర అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ఆరోపించారు. నాగార్జున సాగర్‌ ఘటనపై స్పందించిన రేవంత్‌ రెడ్డి స్పందించారు. కొడంగల్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత రేవంత్‌ రెడ్డి విూడియాతో మాట్లాడారు. రాజకీయ లబ్ది కోసం చేస్తున్న కేసీఆర్‌ పన్నాగాలు ఫలించబోవని అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక సమర్థంగా నీటి పంపకాల విషయాన్ని పరిష్కరిస్తామని రేవంత్‌ రెడ్డి హావిూ ఇచ్చారు. పోలింగ్‌ రోజు ఇలాంటి ఘటనలకు తెరలేపారు. తెలంగాణ ప్రజలు సమయస్ఫూర్తితో వ్యవహరించాలన్నారు. ఏం ఆశించి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారో కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తొమ్మిదిన్నర ఏళ్లుగా కేసీఆర్‌ ఈ సమస్యను పరిష్కరించకపోవడంవల్లే ఇలాంటి ఘటనలు ఉత్పన్న మవుతున్నాయి. వీటన్నింటికి శాశ్వత పరిష్కారం ప్రజామోదయోగ్యమైన ప్రభుత్వం ఏర్పడటమే ముఖ్యమని అన్నారు. రాబోయే కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఇతర రాష్టాల్రతో ఉన్న సమస్యలను సామరస్యంగా పరిష్కరిస్తాం. దేశాల మధ్య నీటి వాటాలు పంచుకుంటున్నాం.. అలాంటిది రాష్టాల్ర మధ్య వాటాలు పంచుకోలేమా… అని అన్నారు. నీటి వాటాలు, ఆస్తుల పంపకాల విషయంలో కాంగ్రెస్‌ సమయస్ఫూర్తితో, సమన్వయంతో వ్యవహరిస్తుందని రేవంత్‌ హావిూ ఇచ్చారు.. అవసరమైనప్పుడు ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్‌ను కేసీఆర్‌ ఉపయోగించుకుంటున్నారు. రాజకీయ లబ్ది కోసం చేస్తున్న కేసీఆర్‌ పన్నాగాలు ఫలించవు. కేసీఆర్‌ వి దింపుడు కల్లం ఆశలే.. ఇలాంటి కుట్రలు ఎన్నికలపై ప్రభావం చూపాల్సిన అవసరం లేదు. వివాదాలను సామరస్యంగా సరైన పరిష్కారం చూపించే బాధ్యత మాది‘ అని రేవంత్‌ రెడ్డి అన్నారు.
టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డికొడంగల్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుటుంబసమేతంగా వెళ్లి కొడంగల్‌లోని జెడ్‌పీహెచ్‌ఎస్‌ బాయ్స్‌ సౌత్‌ వింగ్‌ పోలింగ్‌ బూత్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నా రు. ఓటు వేసే ముందు ఆయన విూడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు సమయస్ఫూర్తి ఉన్నవార న్నారు. అన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం రావాలంటే ప్రజలకు ఆమోదయోగ్యమైన ప్రభుత్వం రావాల న్నారు. రాబోయే కాంగ్రెస్‌ ప్రభుత్వం నీటి సమస్యలపై సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుంటామని తెలిపారు. కాంగ్రెస్‌ ఏర్పాటు చేసే ప్రభుత్వంలో బాధ్యతాయుతంగా వ్యవహరి స్తామని స్పష్టం చేశారు.
ఎలాంటి కుట్రలకు లొంగిపోవద్దని తెలంగాణలో 4 కోట్ల ప్రజలకు రేవంత్‌ విజ్ఞప్తి చేశారు.