కెసిఆర్ మంత్రి ఎర్రబెల్లి సత్యవతి రాథోడ్ చిత్రపటానికి పాలాభిషేకం గిరిజనులు

పెద్దవంగర అక్టోబర్ 02(జనం సాక్షి )తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ గిరిజనులకు 6 శాతం ఉన్న రిజర్వేషన్ ను 10 శాతం రిజర్వేషన్ పెంచి G O NO:33 ప్రకటిచడంతో పాటు సర్కులర్ విడుదల చేయడం హర్షనియమని ఈదురు ఐలయ్య తెరాస మండల పార్టీ అధ్యక్షులు అన్నారు.
ఆదివారం మండల ఎస్టి సెల్ మరియు గిరిజన ప్రజా ప్రతినిధులు ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఎక్స్ రోడ్ దగ్గర సీఎం కెసిఆర్ మంత్రిలు ఎర్రబెల్లి దయాకర్ రావు మరియు సత్యవతి రాథోడ్ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగిందని అన్నారు. తరువాత బాణాసంచా టపాసులు కాల్చి,స్వీట్స్ పంపిణి చేసి ఆనందం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమం లో పాలకుర్తి దేవస్థానం చైర్మన్ వెనుకదాసుల రాంచంద్రయ్య శర్మ, మాజీ ఎఫ్ ఎ సి ఎస్ వైస్ చైర్మన్ ముత్తినేని శ్రీనివాస్,మండల పార్టీ ఉపాధ్యక్షులు పి ఏ సి ఎస్ డైరెక్టర్ బానోత్ వెంకన్న,మండల నాయకులు శ్రీరాం సుదీర్,మండల అధికార ప్రతినిది బానోత్ సోమన్న, మండల ఎస్ టీ సెల్ అధ్యక్షులు ధరవత్ రమేష్, ఉపాధ్యక్షులు జాటోత్ విజయ భాస్కర్,ప్రధాన కార్యదర్శి ధరవత్ బాలు,రైతు కోఆర్డినేటర్ టీ మల్లికార్జున చారి,మండల పార్టీ ప్రచార కార్యదర్శి పసులేటి వెంకట్రామయ్య, సర్పంచ్లు ధరవత్ రాజేందర్, బానోత్ జమునగోపాల్, జాటోత్ చిలుకమ్మాహేమని, ధరవత్ పద్మదేవేందర్,జాటోత్ తార పులసింగ్,గ్రామ పార్టీ అధ్యక్షులు ధరవత్ బుజ్జమ్మ, జాటోత్ కిషన్, భూక్యా దాస్రు, జాటోత్ శ్రీనివాస్, మాజీ సర్పంచ్లు జాటోత్ వెంకన్న, జాటోత్ రెడ్యా,నాయకులు ఎర్ర వెంకన్న, కోరిపల్లి ఉపసర్పంచ్ ఉట్ల వీరారెడ్డి,మైనారిటీ సెల్ ఉపాధ్యక్షులు ఎండీ . ఇబ్రహీం,వార్డు సభ్యులు తేజవత్ యాకన్నా, భూక్యా వెంకన్న,యూత్ నాయకులు భూక్యా మైబు, యాకు,గుగులోత్ సోమన్న, మహిళాలు, గిరిజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.