*కేంద్రం ప్రభుత్వం సోనియా గాంధీపై ఈడీ వేధింపులు అపాలి*:విజయవర్ధన్ రెడ్డి.
పెబ్బేరు జులై 21 ( జనంసాక్షి ):పెబ్బేరు లో కాంగ్రెస్ పార్టీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. ఏఐసీసీ,టిపిసిసి,ఆదేశాల మేరకు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ పై కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా ఈడీ కేసుల పేరిట శ్రీమతి సోనియా గాంధీ అవమానించడనీ,నిరసిస్తూ హైదరాబాదులో ఇందిరా గాంధీ విగ్రహం నుండి ఈడీ కార్యాలయం వద్దకు చేపట్టిన ర్యాలీ కి వెళ్తున్న మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులను అక్రమంగా అరెస్టు చేయడం పై పెబ్బేరు లో కాంగ్రేస్ పార్టీ నాయకులు నిరసన ప్రదర్శనలు చేయకుండా ముందస్తు అరెస్ట్ చేశారని కాంగ్రేస్ నాయకులు ఆరోపించారు. సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎద్దుల విజయవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, తెలంగాణ తల్లి శ్రీమతి. సోనియా గాంధీ పై నరేంద్ర మోడీ సర్కారు ఈడీ కేసుల పేరుతో గొంతు నొక్కే నియంతృత్వ విధానాలను అవలంబిస్తుందని, స్త్రీ నీ గౌరవించే భారత దేశంలో స్త్రీని అవమానించిన ప్రభుత్వాలు ఏమి కూడా నిలబడలేదని, కమల పువ్వు ప్రభుత్వం వాడిపోవడానికి దగ్గరలో ఉందని ఆరోపించారు. అరెస్ట్ అయిన వారిలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బుర్రమోని రాములు యాదవ్, మైనార్టీ నాయకులు షకీల్, ఎస్సీ సెల్ కోశాధికారి శర్వేష్ , కౌన్సిలర్ ఎల్లస్వామి, కాంగ్రెస్ పార్టీ విద్యార్థి భాగం మండల అధ్యక్షులు చంద్రశేఖర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు బోటు శ్రీను, యూత్ కాంగ్రెస్ నాయకులు అల్వాల సాయి తేజ గౌడ్, పరశురాం,రాజు గౌడ్,గంధం సునిల్,అంజి తదితరులు పాల్గొన్నారు.