కేంద్రం రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ ఓ మిథ్య.. ` అసెంబ్లీలో మంత్రి కేటీఆర్
హైదరాబాద్,అక్టోబరు 5(జనంసాక్షి):కరోనా సమయంలో పారిశ్రామిక రంగానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.20లక్షల కోట్ల ఉప సంహరణ ప్యాకేజీ మిథ్యగా మారిందని మంత్రి కేటీ రామారావు విమర్శించారు. పారిశ్రామిక రంగంపై కరోనా ప్రభావం ఏ మేరకు పడిరదని ఎమ్మెల్సీ భానుప్రసాద్‌రావు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. పరిశ్రమల శాఖ తీసుకున్న పురోగమన విధానాలను కేటీఆర్ వివరించారు. కొవిడ్ సమయంలో కొత్త పెట్టుబడు వృద్ధిలో ఎలాంటి తగ్గుదల లేదన్నారు. 2020 ఏప్రిల్ నుంచి కొత్త యూనిట్ల ప్రారంభంలో మాత్రం కొంత తగ్గుముఖం ఉందని తెలిపారు.2020` 21 ఆర్థిక సంవత్సరానికి 3,445 కొత్త పెట్టుబడి ప్రతిపాదనలను ఆమోదించామన్నారు. 2021` 22లో ఇప్పటి వరకు 1,777 కొత్త ప్రతిపాదనలకు ఆమోదం తెలిపామని కేటీఆర్ వెల్లడిరచారు. 2020` 21 ఆర్థిక సంవత్సరంలో 1,939 కొత్త యూనిట్లు రాగా 2021` 22 ఆర్థిక సంవత్సరానికి 102 యూనిట్లు ఉత్పత్తి ప్రారంభించామన్నారు. కొవిడ్ మహమ్మారి ప్రారంభమైన నాటి నుంచి కొత్త పెట్టుబడులకు తెలిపిన ఆమోదాల వల్ల 2లక్షల మందికి పైగా ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తోందని కేటీఆర్ మండలికి వివరించారు.