కేంద్రానికి రాయలసీమ పౌరుషం చూపిస్తాం
అనంతపురం,జూలై11(జనం సాక్షి): ఈనెల 18 నుంచి జరిగే వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో రాయలసీమ పౌరుషం ఏమిటో కేంద్రానికి చూపిస్తామని టీడీపీ ఎంపీ సీఎం రమేష్ అన్నారు. విభజన హావిూలను పక్కన పెట్టిన కేంద్రాన్ని ఊరిగే వదిలేది లేదన్నారు. బుధవారం ఆయన అనంతలో జరిగిన టిడి గర్జన సభలో మాట్లాడారు. ఈనెల 17న ఢిల్లీలో జరిగే అఖిలపక్షం సమావేశానికి దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి హాజరుకావాలని సవాల్ చేశారు. ఏపీకి ప్రత్యేక ¬దా కోసం ప్రధానమంత్రి నరేంద్రమోదీని నిలదీయడానికి జగన్ రావాలని రమేష్ అన్నారు. అనంతపురం టౌన్ స్థానిక ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్‌లో కరువు నేలపై కేంద్రం వివక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పెనుకొండ ఎమ్మెల్యే బికె.పార్థసారథి ఎన్టీఆర్ విగ్రహనికి పూలమాల వేశారు. ఆయన మాట్లాడుతూ…ఇప్పటికైనా కేందప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని ఆంధ్రప్రదేశ్‌కు రావలసిన నిధులను వెంటనే విడుదల చేయాలని, లేకపోతే కేందప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవడానికి సిద్ధంగా ఉండాలన్నారు. ముఖ్యమంత్రి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను అగిపోవాలని ప్రతిపక్ష నాయకుడు జగన్ బిజెపితో కలవటం సిగ్గుచేటన్నారు. ఆంధ్రప్రదేశ్‌పై కేంద్రం చూపుతున్న వివక్షను ప్రజలకు తెలియజెప్పేందుకు అనంతపురం వేదికగా బుధవారం తెలుగుదేశం పార్టీ ఎంపీలు నిరసన దీక్ష చేపట్టారు. అనంతపురంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఉదయం 9 గంటలకు ప్రారంభమైన దీక్ష సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ‘కరవు నేలపై కేంద్రం వివక్ష’ పేరుతో చేపట్టిన ఈ నిరసన కార్యక్రమంలో ప్రధానంగా కేంద్రం చేసిన మోసాన్ని ఎండగట్టనున్నారు. కరవు ప్రాంతాలకు ఎంత వరకు సాయం అందించారు.. ఎలాంటి వివక్ష చూపారన్నది ప్రజలకు వివరించారు. ఇందులో ఎంపిలు జెసి దికార్ రెడ్డి, కొనకళ్ల నారాయణ, మాజీమంత్రి పల్లె రగునాథ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా పార్లమెంటు సమావేశాలు సజావుగా నిర్వహించేందుకు సహకరించాలని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఎంపీలను కోరారు. సభ్యుల ఆందోళనతో బ్జడెట్ సమావేశాలు మొత్తం తుడిచిపెట్టుకుపోయిన సంగతి తెలిసిందే. ఈసారైనా సమావేశాలు అర్థవంతంగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరుతూ సుమిత్ర ఎంపీలకు మంగళవారం లేఖ రాశారు. ఈ నెల 18 నుంచి ఆగస్టు 10 వరకు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఆమె ఈ లేఖ రాశారు.
—