కేంద్ర నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోంది

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా ఆరోపణ

రాజమహేంద్రవరం,జూలై11(జ‌నం సాక్షి): రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించి డబ్బులు ఇవ్వలేదంటూ అసత్య ప్రచారం చేస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ మండిపడ్డారు. ఈ మేరకు ఐదు ప్రశ్నలతో కూడిన లేఖను ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాశారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రాష్టాన్రికి కేందప్రభుత్వం ఒక్క పైసా బాకీలేదని కూడా కన్నా లక్షీనారాయణ స్పష్టం చేశారు. ఆంధప్రదేశ్‌కు పోలవరం గుండె లాంటిదని, పోలవరం జాతీయ ప్రాజెక్ట్‌, రాష్ట్రానికి సంబంధం లేదన్నారు. కేంద్రం ప్రభుత్వం, కాంట్రాక్టర్ల మధ్య రాష్ట్రం సమన్వయకర్త మాత్రమేనని, నిర్దేశిరచిన గడువులోగా పోలవరం నిర్మాణం పూర్తవుతుందని ఆయన ఆకాంక్షించారు. కేంద్రం నిర్మిస్తున్న పోలవరంపై రాష్ట్రం పెత్తనమేంటని కన్నా ప్రశ్నించారు.వైకాపా ఎమ్మెల్యేలను తెలుగుదేశంలో చేర్చుకొని మంత్రి పదవులు కట్టబెట్టడం నయవంచనేనని ఆయన విమర్శించారు. గృహ నిర్మాణంలోనూ ప్రభుత్వం కుంభకోణానికి పాల్పడిందని ఆరోపించారు.