కేంద్ర ప్ర‌భుత్వ వ‌ర‌ద సాయం ఏది..?

సాయం కోరినా స్పందించని కేంద్రం:మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి
నిర్మల్ బ్యూరో, , జూలై 23:జనంసాక్షి రాష్ట్రంలో భారీ వర్షాలతో ప్రకృతి విపత్తు మూలంగా సంభవించిన వరద నష్టాలపై కేంద్రం నుంచి ఎలాంటి సహాయం అందడం లేద‌ని మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. వరదల వల్ల రూ.1400 కోట్ల వరకు నష్టం జరిగిందని ప్రాథమికంగా అంచనా వేసి తక్షణ సహాయంగా రూ.వెయ్యి కోట్లు ఇవ్వాలని కోరినా… ఇంత వ‌ర‌కు ఉలుకు ప‌లుకు లేద‌ని కేంద్ర ప్ర‌భుత్వ తీరును తప్పు ప‌ట్టారు. నాలుగేండ్లలో వివిధ రాష్ట్రాల‌కు వరద స‌హాయం అందించిన కేంద్రం…. తెలంగాణకు మాత్రం రూపాయి ఇవ్వ‌లేద‌న్నారు. ప్ర‌కృతి వైప‌రీత్యాల స‌మ‌యంలో రాష్ట్రాల‌కు అండ‌గా ఉండాల్సిన కేంద్ర ప్ర‌భుత్వం త‌న బాధ్య‌త‌ను విస్మరించింద‌ని తెలిపారు. ఆర్థిక స‌హాయం చేయాల్సింది పోయి… పాలు, పప్పు, ఉప్పుల‌పై జీఎస్టీ రూపంలో కేంద్ర ప్ర‌భుత్వం సామాన్యుల‌పై ప‌న్నుల భారం మోపింద‌ని ఆగ్ర‌హాం వ్య‌క్తం చేశారు. తక్షణ సహాయంగా రూ.వెయ్యి కోట్లు ఇవ్వాలని ఆయ‌న కేంద్రాన్ని డిమాండ్ చేశారు.