కేంద్ర, రాష్ట్రాల వైఖరికి నిరసనగానే సడక్‌బంద్‌

తటాకుల చప్పుళ్లకు భయపడం
విప్‌ జారీ చేయండి తెలంగాణ తీర్మానమైతది
బంద్‌ విజయవంతానికి సర్వం సిద్ధం
కోదండరామ్‌
హైదరాబాద్‌, మార్చి 19 (జనంసాక్షి) :
తెలంగాణ ఏర్పాటులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అను సరిస్తున్న వైఖరికి నిరసనగానే సడక్‌బంద్‌కు నిర్వహి స్తున్నట్లు టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తాటాకు చప్పుళ్లకు భయపడబోమని శాంతియుతంగానే సడక్‌బంద్‌ నిర్వ హించి తీరుతామని స్పష్టం చేశారు. బంద్‌ను విజయ వంతం చేసేందుకు సర్వం సిద్ధం చేశామన్నారు. తెలం గాణ అంశంపై ప్రస్తుత అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో తీర్మానం ప్రవేశపెట్టాలని, తీర్మానం ఆమోదం పొందేం దుకు అన్ని పార్టీలు విప్‌ జారీ చేయాలని కోరారు. తీర్మానం చేయకుంట జరగబోయే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరిం చారు. ఎన్ని అవాంతరాలు కల్పించినా సడక్‌బంద్‌ నిర్వహించి తీరతామని స్పష్టం చేశారు.

తెలంగాణే ప్రజల ఆకాంక్షను వివరించేందుకు హైదరాబాద్‌-కర్నూలు రహదారిపై ఈ నెల 21న తలపెట్టిన సడక్‌బంద్‌ను విజయవంతం చేస్తామని తేల్చి చెప్పారు. తెలంగాణపై అసెంబ్లీలో తీర్మానం చేస్తే ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసుకుంటామని తెలిపారు. అసెంబ్లీలో తీర్మానం పెడితే వీగిపోతుందని ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వాదనలో వాస్తవం లేదని మండిపడ్డారు. విప్‌ జారీ చేస్తే తీర్మానం ఎలా వీగిపోతుందని ప్రశ్నించారు. తెలంగాణ తీర్మానానికి మద్దతివ్వాలని విప్‌ జారీ చేసి, తీర్మానం ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేశారు. అసెంబ్లీలో తెలంగాణ తీర్మానం చేసి ఉంటే.. సడక్‌బంద్‌ను విరమించుకొనే వాళ్లమని తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను కేంద్ర ప్రభుత్వానికి తెలిపేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని… ప్రజలంతా మద్దతివ్వాలని కోరారు. ఆ రోజు ప్రజలు తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని కోరారు. ఏడు కేంద్రాల్లో సడక్‌బంద్‌ నిర్వహిస్తున్నట్లు వివరించారు. పోలీసు బలగాలను దించి సడక్‌బంద్‌ను ఆపాలనుకుంటే అది సాధ్యమయ్యే పని కాదన్నారు. పోలీసులతో ఉద్యమాన్ని అడ్డుకోవాలనుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఎన్ని అవాంతరాలు సృష్టించినా సడక్‌బంద్‌  జరిగి తీరుతుందని తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు తెలంగాణను అవమానపరిచేలా ఉన్నాయని

మండిపడ్డారు. తెలంగాణకు ఒక్క పైసా ఇవ్వను.. ఏం చేస్తారో చేసుకొండని సీఎం వ్యాఖ్యానించడం అవమానించడమేనన్నారు. అందుకే తమ ఆందోళనను ఉద్ధృతం చేస్తున్నామని చెప్పారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఉవ్వెత్తున్న ఎగిసిపడుతున్నా.. తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు ప్రేక్షక పాత్రకే పరిమితమవుతున్నారని విమర్శించారు. వాళ్లకు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పే రోజు త్వరలోనే వస్తుందని హెచ్చరించారు.

తాజావార్తలు