కేఏపాల్‌కు బెయిల్‌ మంజూరు

హైదరాబాద్‌:  సోదరుని హత్య కేసులో అరెస్టయిన కేపా పాల్‌కు హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. రూ. లక్ష వూచీకత్తుతోపాటు పాస్‌పోర్టును పోలీసులకు అప్పగించాలని కోర్టు ఆదేశించింది. 2010లో మహబూబ్‌నగర్‌లో జరిగిన సోదరుడు డేవిడ్‌ రాజ్‌ హత్య కేసులో ఈఏడాది మే 12న ఒంగోలులో పోలీసులు కేఏపాల్‌ను అరెస్టు చేశారు.