కేజ్రీవాల్ దీక్ష విరమణ
న్యూ ఢిల్లీ :
ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ దీక్ష విరమించారు. ఢిల్లీలో పెంచిన విద్యుత్, నీటి చార్జీల పెంపును వ్యతిరే కిస్తూ ఆయన 15 గత రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న విషయం విది తమే. శనివారం ఆయన నిమ్మరసం తీసు కుని దీక్షను విరమిం చారు. ఆయన మాట్లాడుతూ ఢిల్లీ ప్రభుత్వం విద్యుత్, నీటి చార్జీలు పెంచి సామాన్యులపై ఎనలేని భారం మోపిందన్నారు. అసలే నిత్యావసర వస్తువుల పెరుగుదలతో పేదలు ఒక్క పూటా కడుపునిండా భోజనం చేయలేక పోతున్నారన్నారు. ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని, రాబోవు రోజుల్లో తగిన గుణపాఠం ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. వెంటనే చార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు. తాను దీక్ష విరమించినా ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తానని చెప్పారు.