కేపీహెచ్‌బీలో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
హైదారాబాద్: ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌ల నేపథ్యంలో బెట్టింగ్‌లకు పాల్పడుతున్న నలుగురు సభ్యుల ముఠాను కేపీహెచ్‌బీ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద మూడు లాప్‌టాప్‌లు, పది సెల్‌ఫోనులు , రూ.6 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. భారీగా బెట్టింగులు నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు పోలీసులు ఈ దాడులు చేశారు.