కేయూ డిగ్రీ ఫలితాలు విడుదల
వరంగల్,(జనంసాక్షి): కాకతీయ యూనివర్సీటీ డిగ్రీ ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్షకు 2,19,241 మంది విద్యార్థులు హాజరుకాగా 34. 47 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. రీ వాల్యూయేషన్ దరఖాస్తుకు తుది గడువు జూన్ ఎనిమిదిగా నిర్ణయించారు. సప్లిమెంటరీ పరీక్షా ఫీజును జూన్ 19 లోగా చెల్లించాలని అధికారులు తెలిపారు. జూన్ 29 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం అవుతాయని పేర్కొన్నారు.