కేరళలో చర్చి ఫాదర్స్ పైశాచికం
మహిళలపై లైంగిక వేధింపులు
18 నెలల్లోనే 12 మంది క్రిస్టియన్ మత గురువుల అరెస్ట్
తిరువనంతపురం,జూలై11(జనం సాక్షి): దేవుడికి ప్రజలకు వారధులమని చెప్పే మత గురవులు పైశాచికంగా ప్రవర్తిస్తున్నారు. నమ్మి వచ్చిన మహిళలను లొంగ దీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అదీ వీలుకాకపోతే లైంగిక దాడులకు దిగుతున్నారు. కొద్ది రోజులుగా కేరళలో క్రిస్టియన్ మత గురువుల వరుస అరాచక సంఘటనలు కలకలం సృష్టిస్తున్నాయి. కేవలం 18 నెలల్లోనే 12 మంది క్రిస్టియన్ మత గురువులు లైంగిక వేధింపుల కేసుల్లో అరెస్ట్ అయ్యారు. రోమన్ క్యాథలిక్‌కు చెందిన 48 ఏళ్ల ఫ్రాన్సో ముల్లికల్ అనే మహిళ.. బిషప్ జలందర్ నుంచి ఈ యేడాది జనవరి నుంచి లైంగిక వేధింపులకు గురవుతున్నట్లు పేర్కొంది.
జలందర్‌పై ఆవిడ భర్త చర్యలకు ఆదేశించాలని చర్చిని కోరగా కొంత మంది ఒత్తిడి మేరకు విరమించుకున్నారని సమాచారం. కాగా బిషప్ జలందర్‌పై తాము ఎప్పుడో చర్యలు తీసుకున్నామని చర్చి అఫిషియల్స్ తెలిపారు. అయితే జలంధర్‌తో పాటు మరో ఐదుగురిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది బాధితురాలు. లంకార ఆర్థోడాక్స్ చర్చికి చెందిన 34 ఏళ్ల ఓ మహిళపై లైంగిక వేధింపుల కేసులో నలుగురు మత గురువులు అరెస్ట్ చేశారు. మత గురువుల బెదిరింపులకు భయపడి ఈ విషయం దాచినప్పటికీ, భార్యాభర్తలు మాట్లాడుకున్న ఫోన్ రికార్డు భయటికి రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నలుగురు అరెస్ట్ అయ్యారు. కొద్ది సంవత్సరాల పాటుగా తాము లైంగికంగా వేధింపులకు గురవుతున్నామని ఓ నన్‌తో పాటు మరో మహిళ పేర్కొంది. ఈ కేసును నిష్పక్షపాతంగా విచారించి చర్చిని మూసివేయాలని వారు డిమాండ్ చేశారు.