కేసీఆర్‌ను అరెస్టు చేస్తే మాకేం అభ్యంతరం లేదు

` చర్యలు తీసుకుంటామంటే మేమెందుకు అడ్డుకుంటాం:కిషన్‌రెడ్డి
హైదరాబాద్,ఫిబ్రవరి(జనంసాక్షి):మాజీ సీఎం కేసీఆర్‌పై చర్యలు తీసుకుంటామంటే.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఎవరు అడ్డుకున్నారో చెప్పాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో చర్యలు తీసుకోవాల్సింది సీఎం కాదా అని ప్రశ్నించారు. నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విÖడియా సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడారు. ముఖ్యమంత్రికి చేతగాక.. బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ తమకు అవసరం అని చెప్ప్పుకోవాలి కానీ.. కిషన్ రెడ్డి విÖదనో, కేంద్ర ప్రభుత్వం విÖదనో నిందలు వేయొద్దని హితవు పలికారు. కిషన్‌రెడ్డిని అడ్డుపెట్టి సీఎం రేవంత్‌రెడ్డి ఎక్కువ రోజులు తప్పించుకోలేరన్నారు. కేసీఆర్‌పై చర్యలు తీసుకోవాలని ఏ ఒక్క రోజైనా రాహుల్‌గాంధీ.. రేవంత్ రెడ్డిని ఆదేశించారా? అని ప్రశ్నించారు. కేసీఆర్‌పై చర్యలకు రాహుల్ గాంధీ అడ్డుపడకుంటే తక్షణమే చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అడ్డుకోవడం కోసం సోనియా కుటుంబం, కేసీఆర్ కుటుంబం ఏకమయ్యాయని కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. బీఆరఎస్, కాంగ్రెస్.. ఎవరు అధికారంలో ఉంటే వారు మజ్లిస్‌ను ప్రసన్నం చేసుకుంటున్నారని ఆరోపించారు. మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలు ఈ రెండు పార్టీలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. తమను విమర్శించే ముందు సీఎం రేవంత్ ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాలని హితవు పలికారు. రేవంత్ తనను కల్వకుంట్ల కిషన్ రావు అని విమర్శించారని.. తానెలా కల్వకుంట్ల కిషన్ రావు అవుతాను? అని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబాన్ని కాపాడాల్సిన అవసరం తనకు ఎందుకుంటుందని నిలదీశారు. పనికిరాని, పసలేని ఆరోపణలు చేయడం రేవంత్ రెడ్డికి బాగా అలవాటైందని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. రేవంత్ చెత్త విమర్శలకు తాను చాలాసార్లు కౌంటరిచ్చానని అన్నారు. మళ్లీ మళ్లీ ఆయన పిచ్చి ప్రేలాపనలు చేయొద్దని.. ఈ విషయాన్ని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. కేంద్రంపై అనవసరంగా మాట్లాడితే ఊరుకోమని హెచ్చరించారు. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి నాడు ఇందిరాగాంధీని గెలిపిస్తే.. ఆ జిల్లా ప్రజలకు, తెలంగాణకు ఆమె ఏం చేశారో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక దేశంలో అనేక అభివద్ధి కార్యక్రమాలు జరిగాయని కిషన్ రెడ్డి వివరించారు. తమ ఎంపీలకు మోదీ సమ ప్రాధాన్యం ఇస్తారని స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత కేంద్రం తెలంగాణకు ఏం చేసిందో చెబుతామని తెలిపారు. ఈ ఎన్నికల ప్రచారానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వచ్చే అంశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని కిషన్ రెడ్డి తెలిపారు.