కేసీఆర్ మంత్రివర్గంలో ఆరుగురికి చోటు
జూపల్లి కృష్ణారావుకు పరిశ్రమల శాఖ, తుమ్మల నాగేశ్వరరావుకు రోడ్లు భవనాల శాఖ
సి.లక్ష్మారెడ్డికు విద్యుత్ శాఖ, తలసాని శ్రీనివాసయాదవ్‌కు వాణిజ్య పన్నుల శాఖ
ఎ.ఇంద్రకరణ్ రెడ్డికు గృహనిర్మాణ శాఖ, ఏ. చందూలాల్‌కు గిరిజన సంక్షేమ శాఖ
మహబుబ్‌నగర్, ఖమ్మంకు ప్రాతినిథ్యం
తలసాని చేరికతో బలపడ్డ హైదరాబాద్ టీఆర్‌ఎస్
హైదరాబాద్,డిసెంబర్16(జనంసాక్షి): రాష్ట్ర విభజన తరవాత కొత్తగా ఏర్పడ్డ తెలంగాణలో ఆరుగురు కొత్త మంత్రులతో తొలి మంత్రివర్గ విస్తరణ జరిగింది. రెండు దఫాలుగా ఏర్పడ్డ మంత్రివర్గంలో మహిళలకు చోటు లేకుండానే క్యాబినేట్ కూర్పు జరిగింది. మంగళవారం ఉదయం రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ఉమ్మడి గవర్నర్ నరసింహన్ కొత్త మంత్రులతో ప్రమాణం చేయించారు. తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, తలసాని శ్రీనివాసయాదవ్, లక్ష్మారెడ్డి, చందూలాల్, ఇంద్రకరణ్‌రెడ్డిలతో గవర్నర్ మంత్రులుగా ప్రమాణం చేయించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఉప ముఖ్యమంత్రులు రాజయ్య, మహమూద్ అలీ, శాసనసభాపతి మధుసూదనాచారి, మండలి చైర్మన్ స్వామిగౌడ్, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమానికి హాజరై కొత్త మంత్రులకు అభినందనలు తెలిపారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర మంత్రులతో గవర్నర్, సీఎం గ్రూప్ ఫొటో దిగారు. కొత్త మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమానికి తెరాస శ్రేణులు భారీగా తరలిరావడంతో రాజ్‌భవన్ పరిసరాల్లో ట్రాఫిక్ స్తంభించింది. ఈ విస్తరణతో ఇక మంత్రివర్గ విస్తరణకు దాదాపు అవకాశాలు లేనట్లే. అలాగే మొత్తం మంత్రివర్గంలో అసలు మహిళలకు ప్రాధాన్యం కూడా దక్కలేదు. అలాగే తుమ్మల చేరికతో ఖమ్మం జిల్లాకు ప్రాతినిధ్యం దక్కింది. జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డిల చేరికతో పాలమూరుకు కూడా ప్రాధాన్యం దక్కింది. దీంతో ఇప్పుడు పది జిల్లాలకు పూర్తిగా ప్రాధాన్యం దక్కింది. తలసాని చేరికతో నగరానికి ప్రాధాన్యం పెరిగింది. దీంతో జంటనగరాల నుంచి మొత్తం ముగ్గురు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లుగా అయ్యింది. జూన్ 2న తొలి కేబినేట్ ఏర్పాటు తరవాత సుమారుగా ఆరునెలల వ్యవధిలో తొలిసారిగా తెలంగాణ రాష్ట్ర తొలి మంత్రివర్గ విస్తరణ జరిగింది. దీంతో ముఖ్యమంత్రితో సహా కొత్త మంత్రులతో మంత్రుల సంఖ్య 18కి చేరింది. కొత్తగా కొల్లాపూర్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు, జడ్చర్ల టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, నిర్మల్ ఎమ్మెల్యే ఇంద్రకరణ్‌రెడ్డి, ములుగు ఎమ్మెల్యే చందులాల్, టీడీపీ నుంచి ఇటీవలే టీఆర్‌ఎస్‌లో చేరిన తుమ్మల నాగేశ్వర్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్ మంత్రులుగా ప్రమాణం చేశారు. ఇందులో తుమ్మల నాగేశ్వర రావు ఏ సభలోనూ సభ్యుడు కారు. దీంతో ఆయన ఆరు నెలల్లో ఏదో ఒక సభ నుంచి ఎంపిక కావాల్సి ఉంటుంది. నూతన మంత్రులకు శాఖలు చేటాయించాల్సి ఉంది.
ఖమ్మంలో పార్టీ విస్తరణపై దృష్టి
ఖమ్మం జిల్లాలో పార్టీ విస్తరణను దృష్టిలో పెట్టుకుని అక్కడ టిఆర్‌ఎస్ నుంచి ఎంపికైన జలగం వెంకట్రావును కాదని ఇటీవలే పార్టీలో చేరిన తుమ్మలను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ముందునుంచి ఇక్కడ పార్టీ కొంత వెనుకబడే ఉంది. తుమ్మలకు పదవి కట్టబెట్టడం వెనక పార్టీ విస్తరణకు అవకాశాలు ఉన్నాయి. టీడీపీలో మంచి పేరున్న నేతగా ముద్ర వేసుకున్న తుమ్మల సుదీర్ఘ రాజకీయ అనుభవంతో పాటు, సిఎం కెసిఆర్‌కు అత్యంత సన్నిహితుడుగా ముద్ర పడ్డారు. టీడీపీ అధ్యక్షుడు తీరు నచ్చక ఇటీవలే ఆయన టీఆర్‌ఎస్‌లో చేరాక ఆయనకు సీఎం కేసీఆర్ గౌరవంతో మంత్రివర్గంలో స్థానం కల్పించారు. అయితే ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో తుమ్మల మంత్రిగా పని చేసి తన సమర్థతను నిరూపించుకున్నారు. ఖమ్మం జిల్లా అభివృద్ధిలో ఆయన పాత్ర కీలకం. తుమ్మల సమర్థతను గుర్తించిన కేసీఆర్ జిల్లాలో పార్టీ బాధ్యతలను తుమ్మల భుజస్కందాలపై పెట్టారు. తుమ్మల సత్తుపల్లి నియోజకవర్గం నుంచి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. టీడీపీ స్థాపించిన తర్వాత జరిగిన మొదటి ఎన్నికల్లోనే తుమ్మల ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మళ్లీ ఏడాదిన్నరకే 1985లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో విజయం సాధించారు. అప్పుడే తుమ్మలకు ఎన్టీఆర్ కేబినెట్ బెర్త్ అప్పగించారు. ఎన్టీఆర్ మంత్రివర్గంలో చిన్న తరహా నీటి పారుదల శాఖ మంత్రిగా పని చేశారు. 1994, 1999 ఎన్నికల్లో గెలిచిన తుమ్మల చంద్రబాబు మంత్రివర్గంలో కీలకమైన ఎక్సైజ్, భారీ నీటిపారుదల, ఆర్ అండ్ బీ శాఖల బాధ్యతలు నిర్వర్తించారు. 2004 ఎన్నికల్లో సత్తుపల్లి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2009లో ఖమ్మం నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2014లో ఖమ్మం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2014 ఆగస్టు 30న టీడీపీకి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరారు. తుమ్మల చేరికతో ఇప్పుడు ఖమ్మం జిల్లాకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం ఏర్పడింది.
గిరిజన నేత చందులాల్
ములుగు ఎమ్మెల్యేగా ఎన్నికైన చందులాల్ రాపకీయాల్లో అనుభవం ఉన్న వ్యక్తి. వివాద రహితుడిగా పేరున్న చందూలాల్ కూడా టిడిపి నుంచి టిఆర్‌ఎస్‌లో చేరి మొన్నటి ఎన్నికల్లో ములుగు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఇటీవల హైదరాబాద్ బంజారాభవన్, ఆదివాసీ భవన్‌ల శంకుస్థాపన సందర్భంగా స్వయంగా సీఎం కేసీఆరే ఈ సారి గిరిజనులకు మంత్రివర్గ విస్తరణలో తప్పకుండా చోటు లభిస్తుందని చెప్పారు. అందుకు అనుగుణంగా కెసిఆర్ చందూలాల్‌కు మంత్రివర్గంలో చోటు కల్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ హయాంలో చంద్రబాబు మంత్రివర్గంలో చందూలాల్ కేసీఆర్‌తో కలిసి పని చేశారు. గిరిజన శాఖ మంత్రిగా పని చేసిన అనుభవం ఉంది. లాల్ ట్రైకార్ చైర్మన్‌గా పని చేశారు. గిరిజన సమస్యలపై మంచి అవగాహన ఉన్న నేతగా గుర్తింపు ఉంది. అంతే కాకుండా చాలా కాలం కేసీఆర్‌తో పాటే టీడీపీలో పొలిట్‌బ్యూరో సభ్యుడిగా పని చేశారు. మొదటి నుంచి ఇద్దరి మధ్య సత్ససంబంధాలు ఉన్నాయి. కేసీఆర్ టీడీపీ నుంచి బయటకు వచ్చి టీఆర్‌ఎస్ పార్టీని ఏర్పాటు చేసిన తర్వాత 2004లో పార్లమెంట్ ఎన్నికల్లోనే వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తానని పిలిచారు. 2009 ఎన్నికల్లో ములుగు నుంచి టికెట్ ఆశించగా అక్కడి పరిస్థితులు టీడీపీ అనుకూలంగా ఉన్నాయని మహబూబాబాద్ నుంచి పోటీ చేయాలని సూచించారు. ఎంపీ పోటీ చేయాలని భావించినప్పటికీ పొత్తులో భాగంగా ఎంపీ స్థానం టీడీపీ వెళ్లింది. దీంతో మహబూబాబాద్ నుంచి టీఆర్‌ఎస్ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2014 ఎన్నికల్లో ములుగు నియోజకవర్గం నుంచి చందులాల్ గెలుపొందారు. అయితే మొదటి మంత్రి వర్గంలోనే మంత్రి పదవి వస్తుందని భావించినప్పటికీ,తొలి మంత్రి వర్గ విస్తరణ వరకు చందులాల్‌కు ఎదురుచూపు తప్పలేదు. వరంగల్ జిల్లా నుంచి ఇప్పటికే ఉపముఖ్యమంత్రి ¬దాలో రాజయ్య. స్పీకర్‌గా మధుసూధనాచారి ఉన్నారు.
ఎట్టకేలకు జూపల్లికి బెర్త్
తొలిదశలోనే జూపల్లి కృష్ణారావు మంత్రి అవుతారని అంతా భావించినా రాజకీయ సవిూకరణలో విస్తరణ వరకు వేచి ఉండాల్సి వచ్చింది. గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవమున్న జూపల్లి తెలంగాణ ఉద్యమంలో కెసిఆర్ వెన్నంటి నడిచారు. 1981లో బ్యాంకు ఉద్యోగానికి రాజీనామా చేసి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1999 నుంచి ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి దిగిన ఆయన కొల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి 5,305 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2004న స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 3,041 ఓట్ల మెజార్టీతో రెండవసారి విజయ దుందుభి మోగించారు. 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి 1508 ఓట్లతో ముచ్చటగా మూడో సారి గెలిచి వైఎస్ కేబినెట్‌లో పౌరసరఫరాల శాఖ మంత్రిగా పని చేశారు. 2010లో కిరణ్‌కుమార్‌రెడ్డి కేబినెట్‌లో దేవాదాయ ధర్మాదాయ శాఖమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో 2011 మార్చి 3న మంత్రి పదవికి రాజీనామా చేసి.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2011 ఏప్రిల్ 28న జిల్లా కేంద్రం నుంచి జూపల్లి ప్రజాభియాన్ యాత్ర చేపట్టారు. మే 31న దేవాదాయ శాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం అధిష్టానంపై ఒత్తిడి కోసం 2011 అక్టోబర్ 12న తొలిసారిగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. 2011 అక్టోబర్ 30న కాంగ్రెస్‌కు రాజీనామా చేసి కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. 2012 మార్చి 18న జరిగిన కొల్లాపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి 15 వేల 23 ఓట్ల మెజార్టీతో నాలుగవ సారి ఎమ్మెల్యేగా విజయఢంకా మోగించారు. 2014 సాధారణ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా 10,498 ఓట్లతో ఐదో సారి విజయం సాధించారు. జిల్లాలో మాజీమంత్రి డికె అరుణతో ఆయనకు రాజకీయ విభేదాలు ఉన్నాయి.
సర్పంచ్ నుంచి మంత్రిస్థాయి దాకా ఎదిగిన లక్ష్మారెడ్డిజడ్చర్ల టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సర్పంచ్ నుంచి మంత్రిస్థాయి దాకా ఎదిగారు. 1988లో అవంచ గ్రామ సర్పంచ్‌గా ఎన్నిక అయ్యారు. అనంతరం తిమ్మాజిపేట మండల పరిషత్ ఉపాధ్యక్షులుగా పని చేశారు. 1995లో తిమ్మాజిపేట సింగిల్‌విండక్ష అధ్యక్షులుగా ఎన్నిక. 1996లో జిల్లా గ్రంథాలయ అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా నియామకం అయ్యారు. 1999లో స్వతంత్ర అభ్యర్థిగా జడ్చర్ల నుంచి శాసనసభకు పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం 2001లో టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. 2004 -2008లో జడ్చర్ల ఎమ్మెల్యేగా కెసిఆర్ వెన్నంటి నడిచారు. 1981లో బ్యాంకు ఉద్యోగానికి రాజీనామా చేసి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1999 నుంచి ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి దిగిన ఆయన కొల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి 5,305 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2004న స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 3,041 ఓట్ల మెజార్టీతో రెండవసారి విజయ దుందుభి మోగించారు. 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి 1508 ఓట్లతో ముచ్చటగా మూడో సారి గెలిచి వైఎస్ కేబినెట్‌లో పౌరసరఫరాల శాఖ మంత్రిగా పని చేశారు. 2010లో కిరణ్‌కుమార్‌రెడ్డి కేబినెట్‌లో దేవాదాయ ధర్మాదాయ శాఖమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో 2011 మార్చి 3న మంత్రి పదవికి రాజీనామా చేసి.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2011 ఏప్రిల్ 28న జిల్లా కేంద్రం నుంచి జూపల్లి ప్రజాభియాన్ యాత్ర చేపట్టారు. మే 31న దేవాదాయ శాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం అధిష్టానంపై ఒత్తిడి కోసం 2011 అక్టోబర్ 12న తొలిసారిగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. 2011 అక్టోబర్ 30న కాంగ్రెస్‌కు రాజీనామా చేసి కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. 2012 మార్చి 18న జరిగిన కొల్లాపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి 15 వేల 23 ఓట్ల మెజార్టీతో నాలుగవ సారి ఎమ్మెల్యేగా విజయఢంకా మోగించారు. 2014 సాధారణ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా 10,498 ఓట్లతో ఐదో సారి విజయం సాధించారు. జిల్లాలో మాజీమంత్రి డికె అరుణతో ఆయనకు రాజకీయ విభేదాలు ఉన్నాయి.
సర్పంచ్ నుంచి మంత్రిస్థాయి దాకా ఎదిగిన లక్ష్మారెడ్డి
జడ్చర్ల టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సర్పంచ్ నుంచి మంత్రిస్థాయి దాకా ఎదిగారు. 1988లో అవంచ గ్రామ సర్పంచ్‌గా ఎన్నిక అయ్యారు. అనంతరం తిమ్మాజిపేట మండల పరిషత్ ఉపాధ్యక్షులుగా పని చేశారు. 1995లో తిమ్మాజిపేట సింగిల్‌విండక్ష అధ్యక్షులుగా ఎన్నిక. 1996లో జిల్లా గ్రంథాలయ అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా నియామకం అయ్యారు. 1999లో స్వతంత్ర అభ్యర్థిగా జడ్చర్ల నుంచి శాసనసభకు పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం 2001లో టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. 2004 -2008లో జడ్చర్ల ఎమ్మెల్యేగా టీఆర్‌ఎస్ నుంచి గెలుపొందారు. 2008లో కేసీఆర్ పిలుపుతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. 2014లో టీఆర్‌ఎస్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆయన స్వస్థలం అవంచ గ్రామం. ఉద్యమంలో కెసిఆర్‌కు అత్యంత నమ్మకస్థుడిగా నిలబడ్డారు.
ఆదిలాబాద్‌కు మరో ఛాన్స్
ఆదిలాబాద్ జిల్లాకు ఉమ్మడి రాష్ట్రంలో అసలు ప్రాతినిధ్యమే దక్కకపోగా ఇప్పుడు మరోపదవి దక్కింది. సుదీర్ఘ రాజకీయ అనుభవమున్న ఇంద్రకరణ్ రెడ్డి ఇటీవలే టిఆర్‌ఎస్‌లో చేరి ఇప్పుడు మంత్రి అయ్యారు. సుమారు మూడు దశాబ్దాలుగా రాజకీయాల్లో వివిధ పదవులను అనుభవించిన ఆయన మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. పలు సందర్భాల్లో అలోల్లకు మంత్రి పదవి వచ్చినట్లే వచ్చి చేజారింది. 1999లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. 2004లో వైఎస్ నేతృత్వంలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా, మూడు సార్లు జరిగిన మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవి చేజారింది. 2009లో మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటికీ నిర్మల్‌లో అనూహ్య పరిణామాల నేపథ్యంలో అల్లోల ఓటమి పాలవ్వడం ఆయనను తీవ్రంగా కుంగదీసింది.2014 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ నుంచి టికెట్లు దక్కకపోవడంతో ఆయన బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసి అనుహ్యంగా గెలిచి అనంతర పరిణామాల్లో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఇప్పటికే ఇక్కడి నుంచి జోగురామన్న మంత్రిగా ఉండగా, వేణుగోపాలాచారి అధికార ప్రతినిధిగా ఉన్నారు.
రాజధానికి పెరిగిన ప్రాధాన్యం
తెలుగుదేశ్ పార్టీ నుంచి సనత్‌నగర్ ఎమ్మెల్యేగా గెలుపొంది ఇటీవలే టిఆర్‌ఎస్‌లో చేరిన తలసాని ఎట్టకేలకు మంత్రి అయ్యారు. ఆయన చేరికతో ఇప్పుడు నగరానికి ప్రాధాన్యం పెరిగింది. నాలుగు పర్యాయాలు సికింద్రాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1994, 1999, 2000, 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 ఎన్నికల్లో సనత్‌నగర్ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి 27, 371 ఓట్ల మెజార్టీతో తన సవిూప టీఆర్‌ఎస్ ప్రత్యర్ధి దండె విఠల్‌పై గెలుపొందారు. ఐతే ఇటీవలే టీడీపీని వీడి టీఆర్‌ఎస్‌లో చేరారు. శ్రీనివాస్‌యాదవ్ చేరికతో మంత్రివర్గంలో నగర ప్రాతినిథ్యం పెరిగింది. త్వరలో గ్రేటర్ ఎన్నికలు జరుగనున్న దృష్ట్యా తలసాని రాకతో విజయావకాశాలు ఉంటాయని భావిస్తున్నారు.