కేసీఆర్ నాయకత్వంలో గ్రామాల్లో సమగ్రాభివృద్ధి
ప్రజలను గాలికి వదిలేసిన కాంగ్రెస్‌ను నమ్మితే మోసం
వారి మాయమాటలు నమ్మొద్దన్న్న మంత్రి వేముల
నిజామాబాద్,సెప్టెంబర్22(జనం సాక్షి):స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో గ్రామాల్లో సమగ్రాభివృద్ధి జరిగిందని మంత్రి వేముల ప్రశాంతరెడ్డి స్పష్టం చేశారు. ఆయా గ్రామాల్లో చేసే అభివృద్ధి పనులను పరిశీలించారు. బీఆర్‌ఎస్ పాలనలో గ్రామాల్లో సీఎం కేసీఆర్ 90 శాతం మేర అభివృద్ధి పనులు చేపట్టారని, దేశంలో ఇలా ఎక్కడా జరుగలేదని స్పష్టం చేశారు. 50 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలను గాలికి వదిలి వేశారని గుర్తు చేశారు.మళ్లీ అధికారం కోసం కాంగ్రెస్ నాయకులు మాయ మాటలు చెబుతున్నారని, వాటిని ప్రజలు నమ్మవద్దని సూచించారు. రైతులకు మూడు గంటల కరెంటు చాలు అన్న ముష్టి కాంగ్రెస్‌ను నమ్ముకుంటారా, 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను ఇచ్చే బీఆర్‌ఎస్‌ను నమ్ముతారా అని ప్రశ్నించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి రైతులు అంటే ఏమాత్రం పట్టింపు లేదని, వడ్లు కొనం అని, రైతులకు ఉచిత పథకాలు దండుగ అని అమిత్‌షా ప్రకటనలు చేయడం అమానుషమని ధ్వజమెత్తారు.అలాంటి పార్టీకి నమ్మొద్దని సూచించారు. రైతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ చేస్తున్న కృషి ఎంతో గొప్పదన్నారు. రాష్ట్రంలో వ్యవసాయం పండుగలా మారిపోయిందని, దేశంలో వరి పండిరచే రాష్టాల్ల్రో తెలంగాణ ముందంజలో ఉందని వివరించారు. సీఎం కేసీఆర్ విజన్ గొప్ప నాయకుడని,
సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి పనుల్లో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిపారని కొనియాడారు. ర్రెల పంపిణీ పేద యాదవులకు బతుకును నిలబెట్టిందని, చాలా గొప్ప పథకమని, సీఎం కేసీఆర్ వచ్చినంక భరోసా దొరికిందని చెప్పారు. సీఎం కేసీఆర్ ఉద్యమ నాయకుడిగా సుదీర్ఘ పోరాటం చేసి తెలంగాణ రాష్టాన్న్రి తేవడమేకాదు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ నిరుపేదలకు అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా ఆదరణ కోల్పోతున్న కుల వృత్తిదారులు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి కృషి చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణగా ఉద్ఘాటించారు. బీసీ, దళిత బంధు, కల్యాణ లక్ష్మి, గృహలక్ష్మి, మ హిళల ఆరోగ్యం ఇలా.. చెప్పుకుంటూపోతే అనేక పథకాలు ఇక్కడ అమలు చేస్తున్నట్లు వివరించారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ కేసీఆర్‌ను సీఎం చేసుకోవడం మనందరి బాధ్యత అన్నారు.