కేసీఆర్ ను ప్రగతి భవన్ నుంచి ఫామ్ హౌస్ పంపించేది బీజేపీ నే-బీజేపీ జనగామ జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంత్ రెడ్డి

కేసీఆర్ ను ప్రగతి భవన్ నుంచి ఫామ్ హౌస్ పంపించేది బీజేపీ నే-బీజేపీ జనగామ జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంత్ రెడ్డి

జనగామ ప్రతినిధి,జనంసాక్షి:భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడి జన్మదిన సందర్భంగా సేవా సప్తాహా కార్యక్రమంలో భాగంగా బిజెవైయం జిల్లా అధ్యక్షుడు మహిపాల్ అధ్వర్యంలో జనగామ పట్టణంలోని స్థానిక ఎస్.ఆర్.ఆర్ డిగ్రీ కాలేజ్ లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో బిజెపి జనగామ జిల్లా అధ్యక్షులు ఆరుట్ల దశమంత రెడ్డి రక్తదానం చేశారు.ఈ కార్యక్రమంలో 68 మంది రక్తదానం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ సందర్భంగా దశమంత్ రెడ్డి మాట్లాడుతూ బిజెపికి ప్రజల ఆదరణ లేదని మాట్లాడుతున్న కడియం శ్రీహరి వచ్చే ఎలక్షన్లో స్టేషన్గన్పూర్ ప్రజలు బాగా బుద్ధి చెప్తారని,రెండు సీట్ల నుండి 400 సీట్లకి బిజెపికి ఎదిగిందని,అలాగే ఇస్రో చంద్రయాన్ 3 ద్వారా చంద్రుడు పై భారత త్రివర్ణ పతాకం ఎగరవేసిన ఘనత,అలాగే చట్టసభలో మహిళలకి 33% రిజర్వేషన్ ఇచ్చిన ఘనత నరేంద్ర మోడీది అని కొనియాడారు.బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు బేజాడి బీరప్ప మాట్లాడుతూ తెలంగాణ ఆత్మగౌరవాన్ని ప్రగతి భవన్ నుంచి ఫామ్ హౌస్ కి పంపించే వ్యక్తి చేతుల్లో పెడదామా, లేకుంటే ఆత్మగౌరవ భావుట ఎగురవేసే జనగామ బిడ్డ చేతిలో పెడదామా అని వ్యక్తపరిచారు.తెలంగాణ రాష్ట్రంలో 119 మంది బారాస ఎమ్మెల్యేలు కేసీఆర్ కనుసన్నల్లోనే ఫామ్ హౌస్ పరిపాలన జరుగుతుంది అని,కేంద్రం తొమ్మిదేళ్లలో 9 లక్షల కోట్లు కేంద్రం తెలంగాణకు ఇచ్చిందని దేశంలో మూడవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారతదేశం ఉందని,కేంద్రం ఎం ఇవ్వలేదని మాట్లాడే బారాస నేతలు ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు.అబద్ధాల్లో ఆస్కార్ అవార్డు బారాస ఎమ్మెల్యేలకు దక్కుతుందన్నారు.ఒక్కసారి తెలంగాణ రాష్ట్రంలో బిజెపికి అధికారం ఇవ్వాలని,డబల్ ఇంజన్ సర్కార్ తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని దేశం గర్వించే విధంగా బిజెపి పరిపాలన ఉంటుందని,బారాస నాయకులకు కాలం చెల్లిందని జనగామ బిడ్డలు ఎక్కడ ఉన్నా ఒక్కొక్కరు పదిమంధై,పదిమంది వందమంధై,వందమంది వెయ్యి మందై కమలం పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉడుగుల రమేష్,ప్రధాన కార్యదర్శి శివరాజ్ యాదవ్,ఎస్సి మోర్చా జిల్లా అధ్యక్షుడు పసుల అశోక్ ,పట్టణ ప్రధాన కార్యదర్శి సంపత్ కుమార్,తోకల హరీష్, గణపురం కార్తీక్,రఫ్తార్ సింగ్,నవీన్ తదితరులు పాల్గొన్నారు.