కొండాపూర్ లో మంత్రి కొప్పుల ప్రజా ఆశీర్వాద యాత్ర
ధర్మపురి (జనం సాక్షి)ఎండపల్లి మండలం కొండాపూర్ లో ధర్మపురి నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రజా యాత్ర నిర్వహించారు.
గ్రామస్తులు, మహిళలు బతుకమ్మలు,మంగళ హరతులు పట్టి ఘన స్వాగతం పలికారు. గ్రామంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ బైక్ ర్యాలీ లో పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి ప్రసంగించారు. గత పాలకులు ఏనాడు అభి వృద్ది కోసం ఆలోచన చేయలేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపుతో దళితుల అభ్యున్నతికి దళిత బందు తీసుకు వచ్చారని చెప్పారు. గడిచిన 60ఏళ్ళు గా దళితులు అనగ దొక్క బడ్డారని, ఇప్పటికైనా ప్రతీ ఒక్కరు గ్రహించాలని కోరారు. ధర్మపురి ఎస్సీ కుటుంబాలు అదృష్ట వంతులని చెప్పారు. ప్రతీ ఇంటికి దళిత బందు అమలు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రకటించారని గుర్తు చేశారు. గ్రామం చిన్నది అయినప్పటికి అభివృద్ధి చేశామన్నారు. ప్రజలు గుర్తించాలని కోరారు. మాయ మాటలు చెప్పే వారి మాటలు నమ్మితే ప్రజలు మోసపోతారని చెప్పారు.
ఈ సందర్బంగా మండల బిజెవై ఎం అధ్యక్షుడు ప్రమోద్ కుమార్ ఆధ్వర్యంలో దాదాపు వంద మంది యువకులు, మహిళలు మంత్రి కొప్పుల ఈశ్వర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. స్థానిక మైనార్టీ నేతలు మంత్రి కొప్పుల ఈశ్వర్ ను కలిసి సంఘీ భావం తెలిపారు. ఎన్నికల్లో బీఆర్ ఎస్ కే ఓటు వేస్తామని ప్రకటించారు. గ్రామానికి చెందిన చిన్నారి దాచుకున్న డబ్బులు మంత్రి కొప్పుల ఈశ్వర్ కు ఇప్పల నాగరాజు కుమార్తె తను దాచుకున్న డబ్బులను ఎన్నికల ప్రచార ఖర్చులకు అందచేసింది.
ఈ కార్యక్రమంలో పిఎసియస్ ఛైర్మన్ గూడ రామ్ రెడ్డి, కోటిలింగాల ఆలయం చైర్మన్ నారాయణ, గ్రామ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శేఖర్, తదితరులు పాల్గొన్నారు.